అల్లు అర్జున్ - సుకుమార్ కాంబోలో క్రేజీ ప్యాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న పుష్ప ద రూల్ షూటింగ్ చాలా సైలెంట్ గా జరిగిపోతుంది. ప్రస్తుతం పుష్ప 2 షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుంది. రామోజీ ఫిలిం సిటీలో పుష్ప రాజ్ పై నైట్ లైట్ సన్నివేశాలను సుకుమార్ తెరకెక్కిస్తున్నారు.. అని తెలుస్తుంది. అయితే రీసెంట్ గా వైజాగ్ అలాగే మారేడుమిల్లు పరిసర ప్రాంతాల్లో పుష్ప 2 షూటింగ్ లోని ఓ భారీ షెడ్యూల్ పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. ఆ షెడ్యూల్ లోని ఓ సీన్ లీకై సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే అదే షెడ్యూల్ లో సుకుమార్ తెరకెక్కించిన ఓ యాక్షన్ ఎపిసోడ్ సినిమా మొత్తంలో హైలెట్ గా నిలవనుంది అని సమాచారం.
జర్మనీ నుంచి 50 మంది స్టంట్ ఆర్టిస్ట్ లని తీసుకొచ్చి మరీ ఈ భారీ యాక్షన్ ఎపిసోడ్ షూట్ చేశారట. విలన్ గ్యాంగ్ పుష్ప రాజ్ పై తిరగబడే సందర్భంలో భాగంగా పోర్ట్ లో భారీ క్రేజ్ సాయంతో వంద అడుగుల ఎత్తులో అల్లు అర్జున్ ని తలకిందులుగా వేలాడదీసే సీన్ లో అల్లు అర్జున్ పుష్ప రాజ్ గా తన మ్యానరిజాన్ని ప్రదర్శించడమే కాకుండా.. గాల్లో వెళ్ళాడుతూనే కాలు మీద కాలు వేసుకుని మరీ అదిరిపోయే పెరఫార్మెన్స్ ఇచ్చాడట. డూప్ లేకుండా అల్లు అర్జున్ ఈ సన్నివేశంలో చాలా రిస్క్ చేసాడని అంటున్నారు.
ఇంత రిస్క్ చేసి చిత్రీకరించిన ఈ సీన్ పుష్ప 2 లో మెయిన్ హైలెట్ గా నిలుస్తుంది అని.. అల్లు ఫాన్స్ కి అయిపోతే పూనకాలు గ్యారెంటీ అంటూ చిత్ర బృందం ఇస్తున్న హింట్స్ తో సినిమాపై అంచనాలు మరింతగా పెరిగిపోతున్నారు. ఇక పుష్ప 2 రిలీజ్ డేట్ విషయం తేల్చకుండా మైత్రి మూవీస్ వారు ఇంకా సస్పెన్స్ లో పెడుతున్నారు.