ఈరోజు మెగా ఫ్యామిలిలో సంబరాలు జరుగుతున్నాయి. జూన్ 20 న తమ ఇంటికి వచ్చిన మహాలక్ష్మి మెగా ప్రిన్సెస్ బారసాల వేడుక అంగరంగ వైభవంగా జరగబోతుంది. దానికి సంబందించిన ఏర్పాట్లన్నీ ఉపాసన తల్లి ఇంట్లో అంటే మొయినాబాద్ హౌస్ లో మొదలైపోయాయి. అక్కడే పాపకి నామకరణం, ఉయ్యల వేడుక నిర్వహించబోతున్నారు. కోట్ల ఖర్చుతో బారసాల ఏర్పాట్లని ఉపాసన ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా ఆందించేస్తుంది.
అయితే నేడు జరగబోయే ఉయ్యల వేడుకకు కోసం ముముఖేష్ అంబానీ దంపతులు మెగాస్టార్ మనవరాలు మెగా ప్రిన్సెస్ కోసం బంగారు ఉయ్యల బహుమతిగా పంపించారంటూ ఓ న్యూస్ సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తుంది. మెగాస్టార్ మనవరాలి కోసం ముఖేష్ అంబానీ దంపతులు ముంబై నుండి బంగారు ఉయ్యాలని స్పెషల్ గా పంపారంటూ న్యూస్ తెగ వైరల్ అవుతుంది. అయితే ఈవిషయమై రామ్ చరణ్ టీమ్ క్లారిటీ ఇచ్చింది.
ముఖేష్ అంబానీ దంపతులు బంగారు ఉయ్యల పంపారంటూ వస్తున్న వార్తలో నిజం లేదని స్పష్టం చేసింది. ప్రజ్వల ఫౌండేషన్ వాళ్లు బహూకరించిన చెక్క ఊయలనే ఈ కార్యక్రమంలో వినియోగిస్తున్నట్టు తెలిపారు. ఈ ఊయలను మెషీన్ తో కాకుండా చేతితోనే తయారు చేశారు.