నిన్న గురువారం నైట్ టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు కొడుకు ఫస్ట్ బర్త్ డే వేడుకలు హైదరాబాద్ లోని ఓ ప్రముఖ హోటల్ గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసారు. దిల్ రాజు మొదటి భార్య కన్ను మూసాక మూడేళ్లు ఒంటరిగానే గడిపిన ఆయన కోవిడ్ సమయంలో తేజస్విని ప్రేమించి రెండో పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత భార్యని డైరెక్ట్ గా పరిచయం చేస్తే బాగుండదు అనుకున్నారో ఏమో.. ఆయన 50 ఏళ్ళ బర్త్ డే సెలెబ్రేషన్స్ ని గ్రాండ్ గా నిర్వహించారు. దిల్ రాజు 50th బర్త్ డే పార్టీలో ప్రభాస్, మహేష్, చరణ్, పవన్, చిరు లాంటి స్టార్స్ సందడి చేసారు.
ఇక నిన్న నైట్ కొడుకు బర్త్ డే కి కూడా టాలీవుడ్ ప్రముఖులకు ఆహ్వానాలు దిల్ రాజు అందించినట్లుగా తెలుస్తుంది. అయితే ఈవేడుకకి మహేష్ బాబు తన కుమర్తె సితారాతో కలిసి వైట్ డ్రెస్ లో రాగా.. మెగాసార్ చిరంజీవి భార్య సురేఖ తో కలిసి హాజరయ్యారు. అలాగే వెంకటేష్, శ్రీకాంత్ ఆయన కొడుకు రోషన్.. ఇంకా చాలామంది సెలబ్రిటీస్ ఈ పార్టీకి హాజరైన వారిలో ఉన్నారు. అఫీషియల్ గా దిల్ రాజు కొడుకు బర్త్ డే పార్టీ వివరాలు, విజువల్స్ బయటికి రాకపోయినా మహేష్, సితార, వెంకీ, చిరులు కారు దిగి పార్టీ కోసం లోపలి వెళుతున్న విజువల్స్ వైరలయ్యాయి.
అయితే దిల్ రాజు ఈ పార్టీని చాలా సైలెంట్ గా మ్యానేజ్ చేసారని.. అందుకే మీడియాకి కూడా ఎంట్రీ లేదు అని తెలుస్తుంది. ఇక ఎవరెవరు దిల్ రాజు పార్టీలో ఉన్నారో అని చాలామంది క్యూరియాసిటీతో ఉన్నారు.