Advertisementt

మెగా ప్రిన్సెస్ కి అంబానీ బంగారు ఉయ్యాల

Fri 30th Jun 2023 11:26 AM
mega princess  మెగా ప్రిన్సెస్ కి అంబానీ బంగారు ఉయ్యాల
Mukesh Ambani Gifted To MegaPrinces మెగా ప్రిన్సెస్ కి అంబానీ బంగారు ఉయ్యాల
Advertisement
Ads by CJ

సోషల్ మీడియాలో పుట్టకముందు నుండే ట్రెండ్ అవుతూ మెగా ఫ్యామిలీ సంతోషాన్ని రెట్టింపు చేసిన మెగా వారసురాలు, మెగా ప్రిన్సెస్ పుట్టి పదిరోజులవుతున్నా ఇప్పటికి సోషల్ మీడియాలో మెగా ప్రిన్సెస్ పేరు ట్రెండ్ అవడం ఏ స్టార్ వారసులకు జరగలేదేమో. రామ్ చరణ్-ఉపాసన తల్లితండ్రులవడం ఓ ఆనందమైతే, మెగా వారసురాలుగా మెగా ప్రిన్సెస్ వారి ఇంట్లో అడుగుపెట్టడం మరింత సంతోషాన్ని కలిగించింది. మెగాస్టార్ అయితే లక్ష్మి దేవి మా మనవరాలు, మహార్జాతకురాలు అంటూ పొంగిపోతున్నారు.

ఈరోజు జూన్ 30 ఉపాసన-చరణ్ కుమర్తెకి పేరు పెట్టబోతున్నారు. నేమింగ్ సెర్మోని తో పాటుగా.. పాపకి  బారసాల అదేనండి ఉయ్యాల ఫంక్షన్ నిర్వహించబోతున్నట్టుగా ఉపాసన సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. మెగా ఫ్యామిలిలో జరుగుతున్న ఈ వేడుకకి ఇప్పుడు ఎవరెవరు గెస్ట్ లుగా వస్తారో తెలియదు కాని.. ముంబై నుండి బిజినెస్ మ్యాన్ ముఖేష్ అంబానీ-ఆయన భార్య నీతూ అంబానీలు ఉపసన పాప కోసం బంగారు ఉయ్యాల గిఫ్ట్ గా పంపించినట్టుగా ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ముఖేష్ అంబానీ మెగాస్టార్ మనవరాలి కోసం బంగారు ఉయ్యాల గిఫ్ట్ గా పంపారని, దాని కోసం కోటికి పైగా ఖర్చు అయ్యింది అంటూ ఆ న్యూస్ సారాంశం. అందులో నిజమెంతుందో తెలియదు కానీ.. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట సంచలనంగా మారింది.

రామ్ చరణ్-ఉపాసన పాపకి ఈ వేడుకలోనే పేరుకూడా పెట్టబోతున్నారు. ఉపాసన పాప బారసాల ఫంక్షన్ కి జరుగుతున్న ఏర్పాట్లని ఇన్స్టా వేదికగా షేర్ చేస్తూ మెగా ఫాన్స్ కి ట్రీట్ ఇస్తుంది. 

Mukesh Ambani Gifted To MegaPrinces:

Mega Princess Naming Ceremony

Tags:   MEGA PRINCESS
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ