Advertisementt

మెగా మనవరాలి బారసాల

Fri 30th Jun 2023 09:07 AM
ram charan,upasana  మెగా మనవరాలి బారసాల
Ram Charan and Upasana Daughter Naming Ceremony మెగా మనవరాలి బారసాల
Advertisement
Ads by CJ

మెగా ఫ్యామిలీలోకి బుల్లి ప్రిన్సెస్ అడుగుపెట్టడంతో మెగా ఫ్యామిలిలో సంబరాలు అంబరాన్నంటాయి. జూన్ 20 న ఉపాసన పండంటి ఆడపిల్లకి జన్మనివ్వడంతో రామ్ చరణ్ చాలా సంతోషంగా ఫీలయ్యాడు. 11 ఏళ్ళ పెళ్లి బంధంలో రామ్ చరణ్-ఉపాసన కలిసి ఈఏడాది జూన్ 20 న మెగా ఫ్యామిలీకి పాప రూపంలో అతి విలువైన కానుకని అందించారు. అయితే మెగాస్టార్ మనవరాలి రాకతో మహాలక్ష్మి అంటూ మురిసిపోతూ ప్రెస్ మీట్ పెట్టగా.. ఉపాసన ఆసుపత్రి నుండి డిశ్ఛార్జ్ అయిన రోజు రామ్ చరణ్ కూడా తండ్రయిన ఆనందాన్ని ఎంతగా అనుభవించాడో ఆయన మొహంలోనే కనిపించింది.

ఇక పాపకి 21వ రోజు పేరు పెడతామని, నేను ఉపాసన పేరు ని ఫైనల్ చేశామంటూ మీడియాలో మాట్లాడి ఆసక్తిని క్రియేట్ చేసిన రామ్ చరణ్.. ఈరోజు మెగాస్టార్ ఇంట్లోనే బేబీ కి బారసాల ఫంక్షన్ నిర్వహించబోతున్నట్లుగా తెలుస్తోంది. మెగా ఫ్యామిలీ మెంబెర్స్ మధ్యలోనే చరణ్-ఉపాసన బిడ్డకి నేడు ఉయ్యాల వేడుక నిర్వహించబోతున్నారని సమాచారం. పాప జన్మించి 11 రోజులు కావడంతో నేడు ఈ ఫంక్షన్ ని గ్రాండ్ గా కుటుంభ సభ్యుల నడుమ మెగాస్టార్ ఫ్యామిలిలో నిర్వహించబోతున్నారట.

అయితే ఇదే రోజు రామ్ చరణ్ తమ బుల్లి ప్రిన్సెస్ కి ఏం పేరు పెట్టారో కూడా రివీల్ అయ్యే ఛాన్స్ లేకపోలేదు. మరి రామ్ చరణ్-ఉపాసన బిడ్డ మెగా ప్రిన్సెస్ కి ఏం పేరు పెడతారా అని మెగా ఫాన్స్ చాలా ఆతృతగా కనిపిస్తున్నారు. 

Ram Charan and Upasana Daughter Naming Ceremony:

Ram Charan, Upasana begin preparations for daughter naming ceremony

Tags:   RAM CHARAN, UPASANA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ