ప్యాన్ ఇండియా హీరో నిఖిల్ నటించిన స్పై మూవీ నేడు గురువారం బక్రీద్ స్పెషల్ గా ప్రపంచ వ్యాప్త ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. కార్తికేయ 2 లాంటి భారీ హిట్ తరవాత వచ్చిన స్పై పై ప్రేక్షకులు అంచనాలు పెట్టుకున్నారు. ఓవర్సీస్ నుండి.. ఆంధ్ర, తెలంగాణానే కాదు.. ప్యాన్ ఇండియా ప్రేక్షకుల నుండి నిఖిల్ స్పై మూవీకి మిశ్రమ స్పందన వస్తుంది. అటు క్రిటిక్స్ నుండి కూడా స్పై మూవీ మూవీ మిక్స్డ్ రివ్యూస్ వచ్చాయి. అయితే కార్తికేయ 2 హిట్ తో జోష్ మీదున్న నిఖిల్ స్పై మూవీ డిజిటల్ రైట్స్ ని ప్రముఖ ఓటిటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ దక్కించుకుంది.
ఈరోజు విడుదలైన స్పై టైటిల్ కార్డ్స్ లోనే అమెజాన్ ప్రైమ్ పేరు ఓటిటీ పార్ట్నర్ గా వెయ్యడంతో.. స్పై డిజిటల్ పార్ట్నర్ రివీల్ అయ్యింది. స్పై మూవీపై అంచనాలు, సక్సెస్ ఫుల్ హీరో నిఖిల్ ఉండడంతో అమెజాన్ ప్రైమ్ స్పై కి బాగానే కోట్ చేసింది అని తెలుస్తుంది. ఇకపోతే ఆడియన్స్ నుండి మిక్స్డ్ రెస్పాన్స్ దక్కించుకున్న స్పై ని ఓటిటిలో వేక్షించాలి అంటే ఓ ఆరేడు వారాలు ఆగాల్సిందే మరి.. ఈలోపు నిఖిల్ కోసమైనా ఓసారి థియేటర్ కి వెళ్ళొస్తే పోలా..