మీడియం రేంజ్ హీరోల్లో ప్రస్తుతం భారీ హిట్ కొట్టి క్రేజీగా మారిన హీరో నానినే. దసరాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన నాని ప్రస్తుతం Nani30 లో నటిస్తున్నాడు. ఎడాదికి ఒకటి రెండు సినిమాలను చేస్తున్న నాని దసరాతో ప్యాన్ ఇండియా మార్కెట్ లోకి అడుగుపెట్టాడు . ప్యాన్ ఇండియా మార్కెట్ లో దసరా అంతగా సక్సెస్ అవ్వకపోయినా నాని పేరు మాత్రం బాగా రిజిస్టర్ అయ్యింది. ప్రస్తుతం యూత్ హీరోలందరిలో ఊపులో ఉన్న నాని పారితోషకం విషయంలోనూ ఆ రేంజ్ హీరోల్లో అందనంత ఎత్తులో ఉన్నాడంటున్నారు.
దసరా తర్వాత నాని క్రేజ్ తో పాటుగా పారితోషకం పెరిగింది అనే టాక్ వినిపించింది. నాగ చైతన్య, శర్వానంద్, నితిన్, నిఖిల్, రామ్ ఇలా మీడియం రేంజ్ హీరోల్లో నానినే ఎక్కువ పారితోషకం అందుకుంటున్న హీరోగా నిలుస్తున్నాడని అంటున్నారు. నాని ప్రస్తుతం 25 కోట్ల టార్గెట్ కి రీచ్ అయ్యాడనే మాట గట్టిగానే స్ప్రెడ్ అయ్యింది. నాని తర్వాత స్థానంలో విజయ్ దేవరకొండ ఉన్నాడట. అతనికి లైగర్ ప్లాప్ తర్వాత కూడా గ్రాఫ్ తగ్గని కారణంగా పారితోషకం తగ్గలేదట. అదే మెయింటింగ్ చేస్తున్నాడట. ఇక ఆ తర్వాత ప్లేస్ లో రామ్ ఉన్నాడంటున్నారు
నాని కి మరో హిట్ మాడితే ఇక స్టార్ రేంజ్ అందుకోవడం ఖాయమంటున్నారు. అంటే ప్రభాస్, మహేష్, చరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ వాళ్ళ తర్వాత స్థానంలోకి నాని వచ్చినా రావొచ్చనే ఊహాగానాలు మొదలు పెట్టేసారు.