బ్రో.. టీజర్ డేట్ ఎనౌన్సమెంట్ వచ్చేసింది. నిన్న జరగాల్సిన పవన్ కళ్యాణ్ తాలూకు డబ్బింగ్ హంగామా గట్టిగా జరిగింది. అబ్బో ఆ వీడియో ఆ పోస్టర్స్ పొద్దున్నుంచి అవర్స్ టు గో అంటూ పోస్టర్స్ పోటెత్తాయి. సెకన్లు, సెకన్లు లెక్కబెట్టుకుంటూ చకోర పక్షుల్లా ఎదురు చూసిన పవన్ స్టార్ ఫాన్స్ మాత్రం ఫైనల్ గా బక్రీదు రోజున బకరాలయ్యారు.
ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న డేట్ రానే వచ్చింది. అధికారికంగా ప్రకటించిన టైమ్ కాస్తా గడిచిపోయింది. టీజర్ జాడ లేదు. పవన్ దర్శనం లేదు. ప్రస్టేట్ అవుతున్న ఫాన్స్ ఆల్మోస్ట్ బూతులు తో సోషల్ మీడియాని హోరెత్తిస్తున్నారు. ఒకవైపు టీజర్ ఎక్సట్రార్డినరీగా ఉందనే టాక్ ఊరిస్తుంటే అదిప్పటికీ బయటికి రాకపోవడం ఫాన్స్ ని ఉసూరుమనిపిస్తుంది. వింటేజ్ లుక్స్ లో పవన్ ని చూడాలని ఆరాటపడుతున్న ఫాన్స్ కి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వంటి పెద్ద బ్యానర్ ఇలాంటి షాకివ్వడం డైజెస్ట్ అవ్వడం లేదు. ఇప్పటికీ రిఫ్రెష్ చేసుకుంటూ చేతివేళ్లకి నొప్పులు తెచ్చుకుంటున్న పవన్ ఫాన్స్ కి ఆ మాస్ గాడ్ దర్శనం ఇంకెప్పుడో.. లెట్స్ వెయిట్ అండ్ వాచ్.
(అన్నట్టు ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ప్లే చేస్తున్న కేరెక్టర్ టైమ్. టైమే టైముకి రాకపోతే ఎలా బాస్)