Advertisementt

ఇండియన్ 2: శంకర్ కి కమల్ కాస్ట్లీ గిఫ్ట్

Thu 29th Jun 2023 09:12 AM
kamal haasan,indian 2  ఇండియన్ 2: శంకర్ కి కమల్ కాస్ట్లీ గిఫ్ట్
Indian 2: Kamal Costly Gift to Shankar ఇండియన్ 2: శంకర్ కి కమల్ కాస్ట్లీ గిఫ్ట్
Advertisement
Ads by CJ

కమల్ హాసన్-శంకర్ కలయికలో గతంలో వచ్చిన భారతీయుడు ఎంత పెద్ద హిట్టో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దానికి సీక్వెల్ గా ఇండియన్ 2 ని స్టార్ట్ చేసిన శంకర్-కమల్ లు భారీ బడ్జెట్ తో ఈ మూవీని మొదలుపెట్టి మొదటి షెడ్యూల్ ని భారీగా తెరకెక్కించారు. కానీ అనుకోని సంఘటన ఇండియన్ 2 షూటింగ్ ని రెండేళ్లపాటు ఆగిపోయేలా చేసింది. తర్వాత నిర్మాతలు పట్టుబట్టి శంకర్ తో ఇండియన్ 2 సినిమాని మళ్ళీ పట్టాలెక్కించారు. దానితో శంకర్ అటు ఇండియన్ 2 ఇటు గేమ్ ఛేంజర్ షూటింగ్స్ ని బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తున్నారు.

అయితే తాజాగా కమల్ హాసన్ తాను ఇండియన్ 2 రషస్ అందులోను మెయిన్ సీన్స్ చూశానని.. సినిమా చాలా బాగా వచ్చింది అంటూ శంకర్ ని పొగుడుతూ ట్వీట్ చేసారు. ఆ ట్వీట్ తో పాటుగా కమల్ హాసన్ దర్శకుడు శంకర్ చేతిలో ఓ వాచ్ తొడుగుతున్నట్టుగా ఉన్న పిక్ కూడా షేర్ చేసారు. అయితే కమల్ హాసన్ శంకర్ కి ఇండియన్ 2 విడుదలకు చాలా నెలల ముందే ఓ కాస్ట్లీ వాచ్ గిఫ్ట్ ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది. విక్రమ్ హిట్ తో ఫుల్ జోష్ లో ఉన్న కమల్ ఇండియన్ 2 పై బాగా నమ్మకం పెట్టుకున్నారు.

శంకర్ కి కమల్ హాసన్ గిఫ్ట్ గా ఇచ్చిన వాచ్ ఖరీదు ఎంతుంటుందో అంటూ అప్పుడే గూగుల్ లో వెతకడం మొదలు పెట్టేసారు అభిమానులు. కమల్ ఇచ్చిన వాచ్ ధర ఎనిమిది లక్షలు ఉండొచ్చనే అంచనా కూడా వేస్తున్నారు. ఇక శంకర్-కమల్ ఇండియన్ 2 దివాళికి విడుదలయ్యే ఛాన్స్ అయితే కనిపించడం లేదు. మరి ఇండియన్ 2 రిలీజ్ డేట్ కోసం కమల్ అభిమానులతో పాటుగా మెగా ఫాన్స్ కూడా వెయిటింగ్.

Indian 2: Kamal Costly Gift to Shankar:

Kamal Haasan heaps praise on Shankar for Indian 2

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ