ప్యాన్ ఇండియాలోని పలు భాషల్లో అంటే తెలుగు, తమిళ, హిందీ భాషల్లో టాప్ లేపుతున్న రష్మిక మందన్న ప్రస్తుతం పుష్ప ద రూల్ షూటింగ్ లో బిజీగా వుంది. హిందీలో బిగ్ ప్రాజెక్ట్ యానిమల్ షూటింగ్ పూర్తి చేసేసిన రష్మిక తెలుగులో తనకి సక్సెస్ ఇచ్చిన వెంకీ కుడుముల-నితిన్ తో ఓ మూవీ కమిటయ్యింది. ఇక తెలుగు-తమిళ్ లో బైలింగువల్ మూవీ గా రెయిన్ బో చేస్తుంది. అయితే ఎప్పుడూ జిమ్ చేస్తూ డైటింగ్ చేసే రష్మిక ఇప్పుడు చీటింగ్ చేస్తోంది.
మంచి ఫుడ్ ని ఆర్డర్ చేసి దానిని ముందు పెట్టుకుని ఓ పిక్ దిగి దానిని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. You know, on my cheat days I always have to order desserts first before actually my main meal ok.. and a lot of my friends find this super weird.. so I just wanted to understand.. if this is just me or any one of you also do this.. 🤤
మీకు తెలుసా, నా చీట్ డేస్ అప్పుడు మెయిన్ కోర్స్ ముందు ఖచ్చితంగా డెజర్ట్‌లను ఆర్డర్ చేయాల్సి ఉంటుంది. కాని చాలామంది నా ఫ్రెండ్ కి నేను చేసే పని తింగరిగా అనిపిస్తుంది. కాబట్టి నేను అర్థం చేసుకోవాలనుకుంటున్నాను.. ఇది నేను మాత్రమే ఇలా చేస్తానా.. లేదంటే మీలో ఎవరైనా కూడా ఇలా చేస్తారా 🤤 అంటూ తాను డెసర్ట్ ని ఆర్డర్ చేసి ఛిల్ అవుతున్న పిక్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.