ది కేరళ స్టోరీ.. ఈమధ్యనే మలయాళంలో తెరకెక్కి ఇండియా వైడ్ గా ప్రకంపనలు సృష్టించిన చిత్రం. ఆదా శర్మ మెయిన్ లీడ్ లో నటించిన ఈ చిత్రం 200 కోట్లు కొల్లగొట్టి బ్లాక్ బస్టర్ చిత్రంగా నిలిచింది. విడుదలకు ముందు నుండే వివాదాలకు కేరాఫ్ గా మారిన ది కేరళ స్టోరీ థియేటర్స్ లో విడుదలై 50 రోజులు పూర్తి చేసుకుంది. ఓటిటీ ప్రపంచం విపరీతంగా ప్రాచుర్యంలోకి వచ్చాక ఓ చిన్న చిత్రం ఇలా థియేటర్స్ లో 50 రోజులు పూర్తి చేసుకోవడం ఇదే తొలిసారేమో. అయితే కేరళ స్టోరీ ఓటిటీ స్ట్రీమింగ్ పై పెద్ద సస్పెన్స్ నడుస్తుంది.
ది కేరళ స్టోరీ ఓటిటీ స్ట్రీమింగ్ ఎప్పుడు, అసలు ఏ ఓటిటిలో వస్తుంది అనే దానిపై ఇప్పుడు సందిగ్దతనెలకొంది. ఆ మధ్యన కేరళ స్టోరీని జీ 5 నుండి స్ట్రీమింగ్ చేస్తారన్నప్పటికీ.. అది రూమర్ అని తేలిపోయింది. అసలు ఇంతవరకు ఈ కాంట్రవర్సీ ఫిల్మ్ ని కొనడానికి ఏ ఓటిటీ ముందుకు రాకపోవడం వలనే దానిని ఇంతవరకు ఓటిటిలో రిలీజ్ చేయలేదనే టాక్ నడుస్తుంది. కానీ థియేటర్స్ లో బ్లాక్ బస్టర్ అయిన ఈ చిత్రాన్ని ఓటిటిలో చూసేందుకు గాను చాలామంది గూగుల్ లో వెతికేస్తున్నారు.
అయితే తాజాగా కేరళ స్టోరీ ఓటిటీ రిలీజ్ పై నటి ఆదా శర్మ క్లారిటీ ఇచ్చింది. ఒక మంచి సినిమా థియేటర్స్ లో 50 రోజులు పూర్తి చేసుకోవడం చాలా సంతోషించదగ్గ విషయం. ఇది చిత్ర బృందానికి కాదు.. సినిమా ఇండస్ట్రీకి కూడా పండుగలాంటి సందర్భం. నాకు తెలిసి థియేటర్స్ కి వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గాకే ఓటిటిలో విడుదల చేస్తారు. నాకు తెలిసిన సమాచారం ప్రకారం కేరళ స్టోరీని ఏ ఓటిటికి విక్రయించాలా అని మేకర్స్ ఆలోచిస్తున్నారు. అందుకే దీని ఓటిటీ విడుదల ఆలస్యమవుతుంది అంటూ ఆదా శర్మ కేరళ స్టోరీ ఓటిటీ రాక ఆలస్యంపై స్పందించింది.