కొద్దిరోజులుగా మాజీ హీరోయిన్ ఆసిన్ ఆమె భర్త రాహుల్ తో విడిపోబోతుంది, ఆమె భర్త రాహుల్ తో విడాకులు తీసుకోవాలనుకుంటుంది అంటూ బాలీవుడ్ నుండి టాలీవుడ్ మీడియా వరకు ఏవేవో కథనాలు ప్రచారంలోకి వచ్చాయి. ఆసిన్ తన భర్త రాహుల్ చేసే పనులతో విసిగిపోయింది, రాహుల్ వేరే అమ్మాయితో క్లోజ్ గా ఉండడం ఆసిన్ సహించలేకపోయింది అంటూ.. అందుకే ఆమెకి పాప ఉన్నప్పటికీ.. విడాకులకు సిద్దపడింది అన్నారు. అయితే ఈ వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో ఆసిన్ విడాకుల వార్తలపై సోషల్ మీడియా వేదికగానే క్లారిటీ ఇచ్చేసింది.
రాహుల్ తో కలిసి ప్రస్తుతం వేసవి సెలవలని ఎంజాయ్ చేస్తున్నాను, మాపై వస్తున్న డివోర్స్ వార్తలన్నీ నిరాధారమైనవి. రాహుల్ నేను కలిసి ఇప్పుడు బ్రేక్ ఫాస్ట్ కూడా చేసాము. ఆ తర్వాతే మేము విడిపోతున్నామన్న ఒక బేస్ లెస్ వార్త చూసాను. ప్రస్తుతం నేను నా ఫ్యామిలీతో కలిసి టైమ్ స్పెండ్ చేస్తూ ఆ సంతోషాన్ని ఆస్వాదిస్తున్నాను. దయచేసి వినండి.. ఇప్పుడు ఈ రూమర్స్ కోసం ఓ ఐదు నిముషాలు సమయాన్ని వృధా చేసినందుకు నిరాశ చెందుతున్నాను అంటూ ఆసిన్ విడాకుల పుకార్లకు చెక్ పెట్టింది.
ఆసిన్ ఇలా విడాకుల వార్తలపై స్పందించడంతో ప్రస్తుతం #Asin హాష్ టాగ్ సోషల్ మీడియా ట్విట్టర్ హ్యాండిల్ లో ట్రెండ్ చేస్తున్నారు ఆమె అభిమానులు. ఆసిన్ ఆమె భర్త రాహుల్ తో విడిపోవడం లేదు అంటూ అందరూ సంతోషపడిపోతున్నారు.