టాలీవుడ్ లో ఏ ఫ్యామిలీలో లేని హీరోలు మెగా ఫ్యామిలిలో ఉన్నారు. ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏడెనిమిదిమంది హీరోలు మెగా ఫ్యామిలీ నుండి ఇండస్ట్రీని రూల్ చేస్తున్నారు. అందులో ముఖ్యంగా మెగాస్టార్ చిరు, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్ లు స్టార్ హీరోలుగా 100 ల కోట్ల కలెక్షన్స్ తో ఇండస్ట్రీని దున్నేస్తున్నారు. అయితే ఎంతమంది హీరోలున్నా.. ఒకేసారి వారు నటిస్తున్న సినిమాలు రిలీజ్ అయిన సందర్భాలు చాలా తక్కువ. కానీ ఈ ఏడాది ఒక్క నెలలో నలుగురు మెగా హీరోలు మూడు సినిమాలతో ప్రేక్షకులపై దాడికి దిగబోతున్నారు.
అందులో మొదటగా.. పవన్ కళ్యాణ్.. సముద్రఖని దర్శకత్వంలో చేసిన బ్రో మూవీ జులై 28 న విడుదల చేస్తున్నారు. సాయి ధరమ్ తేజ్ తో కలిసి మొదటిసారి పవన్ నటించిన ఈ చిత్రంపై అంచనాలు బాగున్నాయి. ఇక రెండు వారాల గ్యాప్ లో మెగాస్టార్ చిరు ఆగస్టు 11 న భోళా శంకర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తున్నారు. రీసెంట్ గా రిలీజ్ అయిన భోళా శంకర్ టీజర్ తో సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి. తాజాగా మరో మెగా హీరో వరుణ్ తేజ్ తన రీసెంట్ చిత్రం అర్జున రిలీజ్ డేట్ లాక్ చేసేసాడు.
వరుణ్ తేజ్ కూడా పెదనాన్న చిరు భోళా శంకర్ వచ్చిన రెండు వారాలకి గాండీవధారి అర్జున మూవీని ఆగష్టు 25 న రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించడంతో.. మెగా ఫాన్స్ లో ఉత్సాహం మొదలైంది. పవన్ కళ్యాణ్-సాయి ధరమ్ తేజ్, మెగాస్టార్ చిరు, వరుణ్ తేజ్ ఇలా నలుగురు మెగా హీరోలు ఒకే ఒక్క నెలలో మూడు సినిమాలతో ప్రేక్షకులపై దాడికి దిగబోతున్నారు. ఈ విషయంలో మెగా ఫాన్స్ అయితే ఫుల్ హ్యాపీగా కనబడుతున్నారు. రెండు-రెండు వారాల గ్యాప్ తో మెగా కాంపౌండ్ నుండి మూడు సినిమాలు వచ్చేస్తున్నాయని వారు పండగ చేసుకుంటున్నారు.