Advertisementt

సామజవరగమన ప్రెస్ ప్రీమియర్ టాక్

Wed 28th Jun 2023 09:11 AM
samajavaragamana  సామజవరగమన ప్రెస్ ప్రీమియర్ టాక్
Samajavaragamana Premiers Talk సామజవరగమన ప్రెస్ ప్రీమియర్ టాక్
Advertisement
Ads by CJ

శ్రీవిష్ణు హీరోగా రేపు గురువారం జూన్ 29 న ఆడియన్స్ ముందుకు రాబోతున్న సామజవరగమన మూవీ గత రెండు రోజులుగా ప్రీమియర్స్ తో హడావిడి చేస్తుంది చిత్ర బృందం. రాజేష్ దండ తెరకెక్కించిన ఈ క్లీన్ ఫ్యామిలి ఎంటర్టైనర్ ప్రమోషన్స్ లో భాగంగా రిజల్ట్ పై కాన్ఫిడెంట్ గా ఉన్న మేకర్స్ సామజవరగమన మూవీని కొన్ని చోట్ల ప్రీమియర్స్ వేస్తున్నారు. ఈ చిత్రానికి ప్రీమియర్స్ టాక్ పాజిటివ్ గా మొదలైంది. సామజవరగమన ప్రీమియర్స్ కి సూపర్ రెస్పాన్స్ వస్తుంది. ప్రీమియర్స్ షోస్ పడుతున్న థియేటర్స్ లో హౌస్ ఫుల్ బోర్డ్స్ కనిపిస్తున్నాయి.

తాజాగా హైదరాబాద్ లోని AMB మాల్ లో సామజవరగమన ప్రెస్ ప్రీమియర్స్ ని ప్రదర్శించారు. సామజవరగమన చూసిన ప్రెస్ రిపోర్ట్స్ అంతా సినిమా చాలా బావుంది సోషల్ మీడియాలో ట్వీట్స్ వేస్తున్నారు. శ్రీ విష్ణు తన కెరీర్ లో ఎన్నో డిఫరెంట్ కేరెక్టర్స్ లో కనిపించాడు. అయితే తన కెరీర్ లో తనకి హెల్ప్ అయ్యింది ఫ్యామిలీ జోనర్ మాత్రమే. ఇప్పుడు సామజవరగమన కూడా ఫ్యామిలీ ఎంటర్టైనర్. సామజవరగమన ఫస్ట్ హాఫ్ అస్సలు బోర్ కొట్టలేదు. హిలేరియస్ కామెడీ తో హాయిగా సాగింది.. అంటూ ఓ రిపోర్టర్ స్పందించాడు.

అలాగే ఇంట్రవెల్ ట్విస్ట్ కూడా సరదాగా వుంది అంటూ కొంతమంది మాట్లాడుతున్నారు. అయితే సెకండ్ హాఫ్ లో కొన్ని కొన్ని చోట్ల స్లో మూమెంట్స్ వున్నప్పటికీ ఫన్ బాగా వర్క్ అవుట్ అయ్యింది.. అంటూ మరొకరు చెబుతున్నారు. ఓవరాల్ గా సినిమా సూపర్ అంటూ చెప్పడంతో ఇప్పుడు ఈ టాక్ తో సామజవరగమనకి ఓపెనింగ్స్ అదిరిపోయేలా కనిపిస్తుంది. ప్రీమియర్స్ తోనే పాజిటివ్ టాక్ అందుకున్న ఈ చిత్రం శ్రీవిష్ణు కెరీర్ లోనే బెస్ట్ మూవీగా మిగిలిపోతుంది అంటున్నారు.

Samajavaragamana Premiers Talk:

Samajavaragamana mini Review

Tags:   SAMAJAVARAGAMANA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ