యంగ్ టైగర్ ఎన్టీఆర్ హార్డ్ కొర్ ఫ్యాన్ శ్యామ్ రెండు రోజులక్రితం తన ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. శ్యామ్ మృతితో విషాదంలో మునిగిపోయిన ఎన్టీఆర్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా అతనికి సంతాపం తెలియజేసారు. అయితే శ్యామ్ అకాల మరణం చాలామందికి అర్ధం కాలేదు. చిన్న వయసులోనే అతను ఇలా ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడో అనేది అంతుబట్టడం లేదు. చాలామంది శ్యామ్ మృతిపై పలు అనుమానాలు వ్యకం చేస్తూ #WeWantJusticeForShyamNTR హాష్ టాగ్ ట్రెండ్ చేస్తూ న్యాయం కోరుతున్నారు.
ఒకవేళ శ్యామ్ ఉరి వేసుకుంటే అతని కాళ్ళు నేలని ఎలా తాకుతాయి? శరీరం మీద, ముక్కు మీద గాయాలు ఎందుకు ఉంటాయి? ఒకవేళ జేబులో గంజాయి పేకెట్స్ ఉంటే ఆ మత్తులో ఉరి ఎలా వేసుకుంటాడు? హ్యాండ్ కట్ చేసుకుంటే అంత నిబ్బరంగా ఉరి ఎలా వేసుకుంటాడు? అంటూ ఎన్టీఆర్ అభిమానులు చాలామంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అందుకే అతనికి #WeWantJusticeForShyamNTR హాష్ టాగ్ తో న్యాయం చేయమంటూ సోషల్ మీడియాలో హడావిడి చేస్తున్నారు.