వరస డిజాస్టర్స్ తో సతమతమవుతున్న యంగ్ హీరో నితిన్.. ప్రెజెంట్ వక్కంతం వంశీతో ఓ ప్రాజెక్ట్, భీష్మ తో తనకి హిట్ ఇచ్చిన వెంకీ కుడుములతో మరో ప్రాజెక్ట్ మొదలు పెట్టాడు. అలాగే వేణు శ్రీరామ్ తో ఐకాన్ కూడా నితిన్ చేయబోతున్నాడనే న్యూస్ నడుస్తుంది. నితిన్ ఇప్పుడు పోలీస్ డ్రెస్ వెయ్యబోతున్నాడంటున్నారు. అది ఏ సినిమాలో అంటే వక్కంతం తో చేస్తున్న సినిమాలో నితిన్ జూనియర్ ఆర్టిస్ట్ గా కనిపించబోతున్నాడట.
అలా జూనియర్ ఆర్టిస్ట్ గా నితిన్ పోలీస్ గెటప్ వెయ్యగా.. దాని పర్యవసానాలు ఎలా ఉంటాయో.. దాని వలన అతను ఎదుర్కునే సమస్యలేమిటో వక్కంతం కామెడీతో కలిపి చూపించబోతున్నాడని తెలుస్తుంది. ఈ చిత్రానికి జూనియర్ అనే టైటిల్ అనుకున్నారు. కానీ ఇప్పుడు ఎగస్ట్రా ఆర్డినరీమేన్ అనే టైటిల్ ని పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఎగస్ట్రా ఆర్డినరీమేన్ అనేది ప్రేక్షకుల్లోకి ఎంతగా రీచ్ అవుతుందో అనే ఆలోచనలో కూడా మేకర్స్ ఉన్నారట.
మరి నితిన్ ఫైనల్ గా జూనియర్ గా వస్తాడో.. లేదంటే ఎగస్ట్రా ఆర్డినరీమేన్ గా వస్తాడో చూడాలి. ఇక ఈ చిత్రంలో నితిన్ మోస్ట్ హ్యాపెనింగ్ బ్యూటీ శ్రీలీల తో రొమాన్స్ చేయబోతున్నాడు. అలాగే వెంకీ కుడుములతో చేస్తున్న ప్రాజెక్ట్ లో మరోసారి రశ్మికతో జోడి కడుతున్నాడు.