Advertisementt

వైసీపీకి మరో పంచ్ సిద్ధం చేసిన చంద్రబాబు

Mon 26th Jun 2023 07:14 PM
tdp  వైసీపీకి మరో పంచ్ సిద్ధం చేసిన చంద్రబాబు
TDP Starts Nalugella Narakam against Ruling YSRCP వైసీపీకి మరో పంచ్ సిద్ధం చేసిన చంద్రబాబు
Advertisement
Ads by CJ

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రస్తుతం ప్రజలతో మమేకమవుతున్నారు. ఆయన జగన్ ప్రభుత్వాన్ని గద్దె దించేవరకు నిద్రపోను అంటూ శపథం చేస్తున్నారు. వైసీపీ నేతల ఆగడాలను, బూతు మంత్రుల గర్వాన్ని అడిచివేసే వరకు తన పోరాటం ఆగదు అంటున్నారు. కొన్నాళ్లుగా చంద్రబాబు నాయుడు జగన్ ప్రభుత్వం వలన ఇబ్బందులు ఎదుర్కుంటున్న ప్రజల పక్షాన పోరాటానికి దిగడమే కాదు.. తాజాగా నాలుగేళ్ల నరకం పేరుతొ కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ట్విటర్ వేదికగా నాలుగేళ్ళ నరకం కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నట్టుగా ట్వీట్ చేసారు.

రానున్న రోజుల్లో గల్లీ నుండి  పట్టణాల వరకు ప్రజలకు జరిగిన అన్యాయాన్ని, జగన్ ప్రభుత్వం వలన ప్రజలు ఎదుర్కుంటున్న సమస్యలని, వైసీపీ నాయకుల అక్రమాలను ఎత్తి చూపే విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు చంద్రబాబు తెలిపారు. నెలరోజుల పాటు టీడీపీ నేతలు ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు.. ప్రతి వర్గానికి జరిగిన అన్యాయాన్ని ఎత్తి చూపుతూ నలభై ఏళ్లు రాష్ట్రాన్ని వెనక్కి ఎలా నెట్టారో ప్రజలకు వివరించేందుకు సిద్ధమవుతున్నారు. అందులో భాగంగానే మొదటిరోజు రోజు చంద్రబాబు ఇది రాష్ట్రమా.. రావణ కాష్ఠమా.. అంటూ మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, దాడులు గురించి ప్రశ్నిస్తూ వీడియో రిలీజ్ చేశారు.

నేను మీ బిడ్డని అని చెప్పుకునే జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఏదైనా దుర్ఘటన జరిగితే చిక్కటి చిరునవ్వుతో చనిపోయిన వారి కుటుంబాలకు డబ్బులు అందించటం మాత్రమే తెలుసు అంటూ చంద్రబబు ఎద్దేవా చేసారు. నిజంగా ప్రజల బిడ్డే అయితే దాడులు చేసిన సొంత పార్టీ నేతలను కాపాడుకుంటాడా అని ప్రశ్నించారు. మీ బిడ్డే అయితే నష్ట పరిహారాన్ని నవ్వుతూ ఇప్పిస్తాడా అని నిలదీశారు. ప్రజల బిడ్డే అయితే పేదల ప్రాణాలు వెలకట్టే పెత్తందారు అయ్యేవాడా అంటూ చంద్రబాబు జగన్ పై ఫైర్ అయ్యారు.

TDP Starts Nalugella Narakam against Ruling YSRCP:

Chandrababu Tweet On Ysrcp Four Years Ruling Started Nalugella Narakam Programme

Tags:   TDP
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ