కోలీవుడ్ హీరో విజయ్ పై కేసు నమోదు కావడం హాట్ టాపిక్ గా మారింది. హీరో విజయ్ తన సినిమాల్లో స్మోక్ చేస్తూ కనిపించడంతో చెన్నై కి చెందిన సామాజిక కార్యకర్త ఆర్టి సెల్వం కోర్టుని ఆశ్రయించాడు. నార్కోటిక్ కంట్రోల్ యాక్ట్ కింద చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ అతను కోర్టుని కోరాడు. అసలు విజయ్ సిగరెట్ కథ ఏమిటి అంటే.. విజయ్ టాప్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తో LEO మూవీ చేస్తున్నాడు. విజయ్ బర్త్ డే స్పెషల్ గా LEO నుండి నా రెడీ సాంగ్ రిలీజ్ చేసారు మేకర్స్. అయితే ఆ సాంగ్ లోని ప్రతి సీన్ లో విజయ్ నోటిలో సిగరెట్ తో కనిపించాడు.
చాలా సినిమాల్లో హీరోలు సిగరెట్స్ కాలుస్తూ కనిపించినా అది జస్ట్ యాక్టింగ్ కే పరిమితం కాబట్టి పెద్ద కాంట్రవర్సీ అవ్వదు. ధూమ పానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరమని వేస్తేనే దానిని సెన్సార్ కట్ లో లేకుండా చూసుకుంటారు. అయితే ఇక్కడ విజయ్ కూడా అదే లెక్కన సిగరెట్ కాలుస్తూ కనిపించాడనుకోవచ్చు. కానీ విజయ్ రీసెంట్ గా తమిళనాట 10, 12 క్లాసెస్ లో మంచి స్కోర్ తెచ్చుకున్న స్టూడెంట్స్ ని కలిసి వారిని సత్కరించడమే కాకుండా.. చెడు వ్యసనాలకు బానిసలవ్వొద్దు.. యువత మీ ఓట్ హక్కుని అమ్ముకోకూడదు.. అలా పేరెంట్స్ వాళ్ళని మంచి మార్గంలో పెట్టాలంటూ ఆ మీటింగ్ లో చెప్పాడు.
మరి ఇన్ని మంచి మాటలు చెప్పి వారిని ఎంకరేజ్ చేసిన హీరో విజయ్ ఇలా తన సినిమాల్లో ధూమ పానాన్ని ఎలా ఎంకరేజ్ చేస్తాడు. దీనిని బట్టి మీరు యూత్ కి ఏం చెప్పాలనుకుంటున్నారు అంటూ ఆర్టి సెల్వం ఇలా హీరో విజయ్ పై చెన్నై కోర్టులో కేసు వేసాడు.