Advertisementt

ఏంది పవనూ ఈ స్పీడు!

Mon 26th Jun 2023 03:15 PM
pawan kalyan,og  ఏంది పవనూ ఈ స్పీడు!
Pawan Kalyan OG enters the halfway mark ఏంది పవనూ ఈ స్పీడు!
Advertisement
Ads by CJ

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్పీడు ఏపీ రాజకీయాల్లో అనుకునేరు.. కాదు సినిమాల్లో. ఆయన ఈ ఏడాదికి రెండు సినిమాలని రిలీజ్ చేసే ఉద్దేశ్యంలో కనిపిస్తున్నారు. ఇప్పటికే బ్రో సినిమాని జులై 28 న విడుదలకు రెడీ చేసారు. ఇప్పుడు సుజిత్ డైరెక్షన్ లో దానయ్య నిర్మాతగా తెరకెక్కుతున్న OG మూవీ షూటింగ్ అంతే జెట్ స్పీడులో చేసేస్తున్నారు. మూడు షెడ్యూల్స్ ముగిసేలోగా.. 50 శాతం షూటింగ్ ఫినిష్ అయ్యింది అంటూ మేకర్స్ ప్రకటించడం చూస్తే పవన్ స్పీడుకి ఆయన ఫాన్స్ కే మెంటలెక్కిపొతుంది. 

యాక్షన్, ఎపిక్‌నెస్ మరియు డ్రామా... మూడు అద్భుతమైన షెడ్యూల్‌లు పూర్తయ్యాయి, దుమ్ము రేపాయి. ఓజీ చిత్రీకరణ 50 శాతం పూర్తయింది. రాబోయే షెడ్యూల్స్ మరింత ఆసక్తికరంగా ఉండనున్నాయి.. అని ప్రకటించారు. ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ అంటూ సుజిత్ షూటింగ్ ని పరుగులు పెట్టించడం కాదు.. పవన్ కళ్యాణ్ అదే రకంగా వాళ్ళకి డేట్స్ ఇవ్వడంతో ఇంత స్పీడుగా షూటింగ్ జరిగిపోతుంది. అది చూసిన పవన్ ఫాన్స్ ఏందయ్యా పవనూ ఈ స్పీడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఇదే రేంజ్ లో పవన్ కళ్యాణ్ కోపరేట్ చేస్తే.. సినిమాని డిసెంబర్ లో విడుదల చెయ్యడం పక్కాగా కనిపిస్తుంది.

ఇంకా ఈ సినిమాలో ఇమ్రాన్ హష్మీ విలన్ కేరెక్టర్ లో కనిపించబోతుంటే.. హీరోయిన్ గా ప్రియాంక అరుల్ మోహన్ నటిస్తుంది. కోలీవుడ్ నటుడు అర్జున్ దాస్, శ్రీయ రెడ్డిలు OG లో భాగమవడంతో ఈ ప్రాజెక్ట్ పావు విపరీతమైన హైప్ క్రియేట్ అయ్యింది.  

Pawan Kalyan OG enters the halfway mark:

Pawan Kalyan OG shooting update 

Tags:   PAWAN KALYAN, OG
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ