Advertisementt

పుష్ప 2 అయిపోయింది.. దేవర మిగిలింది

Mon 26th Jun 2023 01:15 PM
ntr,devara  పుష్ప 2 అయిపోయింది.. దేవర మిగిలింది
Pushpa 2 is gone.. Devara remains పుష్ప 2 అయిపోయింది.. దేవర మిగిలింది
Advertisement
Ads by CJ

పుష్ప 2 లో అల్లు అర్జున్ సరసన సాయి పల్లవి నటించబోతుంది అనే ప్రచారం రెండు నెలల క్రితం సోషల్ మీడియాలో ఎంత గట్టిగా చక్కర్లు కొట్టిందో చూసాం. అసలు ఓసారి పుష్ప పార్ట్ 1 లో కనిపించిన రశ్మికని తప్పించేసారు.. ఆ ప్లేస్ లోకి నేచురల్ బ్యూటీ సాయి పల్లవి దిగబోతుంది అన్నారు. తర్వాతేమో.. రష్మిక కేరెక్టర్ పార్ట్2లో చనిపోతుంది.. ఆ తర్వాత సాయి పల్లవి కేరెక్టర్ ఎంట్రీ అంటూ ప్రచారం జరిగింది. కానీ సాయి పల్లవి తాను పుష్ప 2 లో నటించడం లేదు అంటూ తెలిచేసింది.

ఇక ఇప్పుడు సాయి పల్లవి దేవరలో నటించబోతుంది.. మొదటిసారి జూనియర్ ఎన్టీఆర్ తో సాయి పల్లవి జోడి కడుతుంది అంటూ ప్రచారం మొదలైంది. ఈ రోజు సోమవారం సోషల్ మీడియా నిండా సాయి పల్లవి ఎన్టీఆర్ తో కలిసి దేవరలో స్క్రీన్ షేర్ చేసుకోబోతుంది అనే న్యూస్ లే కనిపిస్తున్నాయి. ఇప్పటికే జాన్వీ కపూర్ దేవరలో హీరోయిన్ గా కన్ ఫమ్ అయ్యింది. ఇప్పుడు సాయి పల్లవి సెకండ్ లీడ్ లో కనిపించబోతుంది అంటున్నారు.

మరి ఇది నిజమా.. లేదంటే.. పుష్ప 2 లో జరిగినట్టుగానే దేవరలో కూడా సాయి పల్లవి నటిస్తుంది అనేది ఉత్తుత్తి ప్రచారమే అని తేల్చేస్తారా.. అని కొంతమంది మాట్లాడుతుంటే.. సాయి పల్లవి దేవరలో ఎన్టీఆర్ తో కలిసి డాన్స్ చేస్తే సినిమా సూపర్ హిట్ అవుతుంది.. అందుకే దేవరలో సాయి పల్లవి ఉండాలని మరికొంతమంది కోరుకుంటున్నారు.

Pushpa 2 is gone.. Devara remains:

NTR Devara update: Sai pallavi finalized for key role

Tags:   NTR, DEVARA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ