Advertisementt

విషాదం: ఎన్టీఆర్ అభిమాని మృతి

Mon 26th Jun 2023 11:22 AM
jr ntr  విషాదం: ఎన్టీఆర్ అభిమాని మృతి
Tragedy: NTR Die Hard fan dies విషాదం: ఎన్టీఆర్ అభిమాని మృతి
Advertisement
Ads by CJ

స్టార్ హీరోల అభిమానులు.. తమ హీరోల కోసం ప్రాణం పెడతారు. కొన్ని కొన్నిసార్లు అభిమానంతో చేసే పనులతో ప్రాణాల మీదకి తెచ్చుకుంటారు. హీరోలని చూడాలనే ఆశతో ఏవేవో చేస్తారు. ఈమధ్యన విశ్వక్ సేన్ నటించిన ధమ్కీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గెస్ట్ గా వచ్చిన ఎన్టీఆర్ తో ఫోటో దిగాలని తాపత్రయంలో ఆయన వీరాభిమాని ఒకరు స్టేజ్ ఎక్కేసి ఎన్టీఆర్ మీదకి దూసుకెళ్ళిపోయిన ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అలా స్టేజ్ మీదకి దూసుకొచ్చిన అతన్ని ఎన్టీఆర్ సెక్యూరిటీ  పక్కకి లాగి పడేస్తుండగా.. ఎన్టీఆర్ ఆగి ఆ అభిమానితో ఫోటోకి ఫోజులిచ్చిన ఘటన అందరికి తెలిసిందే.

అయితే ఇప్పుడా ఎన్టీఆర్ వీరాభిమాని మరణించాడు. ఎన్టీఆర్ హార్డ్ కొర్ ఫాన్స్ లో ఒకరైన శ్యామ్ అనే అభిమాని చాలా చిన్న వయసులో మృతి చెందడం అందరిని కలిచి వేసింది. శ్యామ్ ఉన్నట్టుండి కన్నుముయ్యడంతో విషాదంలోకి వెళ్లిపోయిన ఎన్టీఆర్ ఫాన్స్.. ధమ్కీ ఈవెంట్ లో ఎన్టీఆర్ తో ఫోటో దిగేందుకు శ్యామ్ ప్రయత్నం చేసిన వీడియో ని షేర్ చేస్తూ #OMShanti హాష్ టాగ్ ని ట్రెండ్ చేస్తున్నారు.

Tragedy: NTR Die Hard fan dies:

Junior NTR Die Hard Fan Shyam Passed Away

Tags:   JR NTR
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ