Advertisementt

అర్జున్ కుమార్తె ఐశ్వర్య పెళ్లి కబుర్లు

Mon 26th Jun 2023 09:20 AM
arjun  అర్జున్ కుమార్తె ఐశ్వర్య పెళ్లి కబుర్లు
Arjun Daughter To Get Married To This Actor? అర్జున్ కుమార్తె ఐశ్వర్య పెళ్లి కబుర్లు
Advertisement
Ads by CJ

నటుడు అర్జున్ తన కుమర్తె ఐశ్వర్య అర్జున్ హీరోయిన్ గా టాలీవుడ్ హీరో విశ్వక్ సేన్ తో లాంచ్ చెయ్యాలని గ్రాండ్ గా సినిమాని పెట్టాడు. ఆ సినిమా నుండి ఉన్నట్టుండి విశ్వక్ తప్పుకోవడంతో మరో హీరోతో అర్జున్ ఆ సినిమా చెయ్యాలనుకున్నాడు. ఆ విషయాలన్నీ పక్కనబెడితే తాజాగా అర్జున్ ఇంట పెళ్లి భాజాలు మోగబోతున్నాయి. ఐశ్వర్య అర్జున్ పెళ్లి కుదిరినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం కోలీవుడ్ లో ఐశ్వర్య అర్జున్ పెళ్లి వార్త హాట్ హాట్ గా చక్కర్లు కొడుతోంది.

కోలీవుడ్ కి చెందిన ప్రముఖ హాస్య నటుడు తంబీ రామయ్య కుమారుడు ఉమాపతితోనే ఐశ్వర్య అర్జున్ పెళ్లి పీటలెక్కబోతుంది, ఈమధ్యనే ఇరు కుటుంబాల వారు కలిసి ఉపమాపతి-ఐశ్వర్య అర్జున్ ల వివాహం గురించి మట్లాడుకున్నారట. ఉపమాపతి-ఐశ్వర్య అర్జున్ లు కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్నారని.. అందుకే ఇరు కుటుంబాల వారు వీరి ప్రేమని ఒప్పుకుని.. పెళ్లి చేసేందుకు రెడీ అయ్యారంటూ కోలీవుడ్ మీడియాలో చక్కర్లు కొడుతున్న న్యూస్.

Arjun Daughter To Get Married To This Actor?:

Arjun daughter to Tie the Knot

Tags:   ARJUN
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ