పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చాక సినిమా ఇంస్ట్రీలో చాలామంది ఆయన్ని విమర్శించడం కాదు.. అవకాశం వచ్చినప్పుడల్లా మాటల తూటాలతో చీల్చి చెండాడుతున్నారు. అందులో ముఖ్యంగా 30 ఇయర్స్ ఇండస్ట్రీ నటుడు పృథి, పోసాని కృష్ణమురళి, అలీ లాంటి వాళ్ళు ఉన్నారు. వీరంతా జగన్ ప్రభుత్వానికి భజన చేసే బ్యాచ్. వారు వైసీపీ పార్టీలో చేరి చంద్రబాబుని, జనసేనాని పవన్ కళ్యాణ్ ని నోటికొచ్చినట్లుగా మట్లాడారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ సినిమాల్లో వీరు ముగ్గురూ కనిపించకుండా పోయారు. వీరి ముగ్గురిలో పృథ్వీ రాజ్ కి బుద్దొచ్చి వైసీపీని వీడి ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కి భజన చేస్తున్నాడు.
ఇప్పుడు పోసాని కృష్ణమురళి కూడా పవన్ కళ్యాణ్ మంచోడనే భజన ఎత్తుకున్నాడు. నిన్నటివరకు జగన్ ప్రభుత్వాన్ని చూసి విర్రవీగి పవన్ ని విమర్శించిన పోసాని నేడు ఇలా మాట్లాడడం అందరికి ఆశ్చర్యం కలిగించింది. జగన్ మెప్పు పొందేందుకు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీపై నోటికొచ్చినట్లుగా మాట్లాడుతూ.. జగన్ దగ్గర పదవులని అనుభవిస్తున్న పోసాని ఇప్పుడు సడన్ గా ప్లేట్ మార్చి పవన్ కళ్యాణ్ చాలా మంచోడు, మెగాస్టార్ మంచోడు.. అంటూ ప్రేమ కురిపించడం హాట్ టాపిక్ అయ్యింది.
అయితే తానేదో మెగా అవకాశాల కోసమే పవన్ ని పొగడడం లేదు.. 60 ఏళ్ళ వయసులో పవన్ కళ్యాణ్ పనిగట్టుకుని అవకాశాలు రానివ్వకపోయినా.. నాకు వచ్చే నష్టమేమి లేదన్న పోసానిని మీడియా వారు.. సడన్ గా పవన్ పై మీలో ఇంత మార్పు వచ్చింది కారణం తెలుసుకోవచ్చా అని అడిగితే.. దానికి పోసాని కృష్ణమురళి.. చంద్రబాబు లో మంచి తనం లేదు, ఆయనతో పోల్చుకుంటే పవన్ కళ్యాణ్ చాలా మంచి వాడు. ఒకప్పుడు చంద్రబాబు ని పొగిడి ఇప్పుడెందుకు తిడతాను, అతని బ్యాడ్ బిహేవియర్ వలన.
పవన్ కళ్యాణ్ కి పవర్ స్టార్ అని పెట్టిందే నేను. అప్పుడు పవన్ మంచివాడు, ఆవేశపరుడు, చాలా సిన్సియర్, కొంచెం ఆశయాలు ఉన్న మనిషి, కోపంతో రగిలిపోయేవాడు.. ఇలా ఎందుకు మారవు. రాజకీయాల్లోకి వచ్చి చంద్రబాబు తో కలిసి దిగజారి మాట్లాడుతున్నావ్.. అనే ఉద్దేశ్యంతోనే నేను అన్నాను అంటూ పవన్ కళ్యాణ్ ని ఎందుకు విమర్శించాడో పోసాని చెప్పుకొచ్చాడు.