పవర్ స్టార్ పవన్ కళ్యాణ్-సాయి ధరమ్ తేజ్ కాంబోలో క్రేజీ మూవీగా సముద్ర ఖని తెరకెక్కిస్తున్న బ్రో మూవీ జులై 28 న విడుదల చేస్తామని మేకర్స్ ఎప్పుడో ప్రకటన ఇచ్చేసారు. పవన్ కళ్యాణ్ మోడ్రెన్ భగవంతుడి అవతార్, సాయి ధరమ్ తేజ్ భక్తుడి లుక్, మామ అల్లుళ్ళ కాంబో లుక్ అన్ని ఫ్యాన్స్ ని బాగా ఇంప్రెస్స్ చేసాయి. పవన్ కళ్యాణ్ త్వరగా షూటింగ్ పూర్తి చేసి ఆయన వేరే ప్రాజెక్ట్ లోకి వెళ్ళిపోయినా.. సముద్ర ఖని చకచకా షూటింగ్ పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ కి తీసుకెళ్లిపోయారు. తాజాగా ప్రమోషన్స్ లో భాగంగా బ్రో టీజర్ వదిలేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.
బ్రో టీజర్ జూన్ 29న తోలి ఏకాదశి పర్వదినాన వదిలేందుకు మేకర్స్ సిద్దమైనట్లుగా తెలుస్తుంది. జులై 29 గురువారం పవన్ కళ్యాణ్-సాయి తేజ్ ల బ్రో టీజర్ వస్తుంది అని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంతో పవన్ ఫాన్స్, మెగా ఫాన్స్ అలెర్ట్ అవుతున్నారు. ఈ చిత్రంలో సాయి ధరమ్ తేజ్ సరసన కేతిక శర్మ నటిస్తుండగా.. ఐటెం సాంగ్ లో బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేల్ల కనిపించబోతుంది. ఇక బ్రో విడుదలకు ఇంకా నెల రోజులు సమయం ఉండడంతో.. ఈ నెల రోజులూ పవన్ కళ్యాణ్ లేకుండానే ప్రమోషన్స్ మొదలు పెట్టే ఆలోచనలో ఉన్నారు మేకర్స్.