నిర్మాత KP చౌదరిని డ్రగ్స్ కేసులో పోలీసులు అరెస్ట్ చేసి విచారణ చేప్పట్టడంతో పలువురు సినీ సెలబ్రిటీస్ పేర్లు మీడియాలో సంచలనంగామారాయి. అందులో ముఖ్యంగా బిగ్ బాస్ ఫేమ్ అశు రెడ్డి తో పాటుగా సినిమా ఇండస్ట్రీతో లింక్ ఉన్న 12 మంది పేర్లు వైరల్ అయ్యాయి. KP చౌదరి.. పోలీస్ లకి దొరికిన తర్వాత తనకి డ్రగ్స్ తీసుకునే అలవాటు ఉంది.. కానీ తాను ఎవరికీ డ్రగ్స్ విక్రయించలేదని బుకాయించినా.. అతని ఫోన్ తో పోలీసులు తీగలాగితే డొంక కదిలినట్టుగా KP చౌదరితో సంబంధం ఉన్న 12 మంది పేర్లు బయటికొచ్చాయి.
అయితే ఇప్పుడు కేరెక్టర్ ఆర్టిస్ట్ సురేఖ వాణి, ఆమె కుమార్తె సుప్రీత KP చౌదరితో సన్నిహితంగా ఉన్న ఫోటో బయటికి రావడంతో అందరూ ఈ డ్రగ్స్ కేసుతో సురేఖ వాణి ఆమె కూతురికి కూడా సంబంధం ఉందేమో అన్న కోణంలో న్యూస్ లు స్ప్రెడ్ చెయ్యడం కలకలం సృష్టించింది. KP చౌదరి బుగ్గ మీద సురేఖ వాణి ముద్దుపెడుతున్న పిక్ వైరల్ గా మారింది. ఈ వార్తల నేపథ్యంలో సురేఖ వాణి హడావిడిగా ఓ వీడియో రిలీజ్ చేసింది. కొద్దిరోజులుగా మామీద వస్తున్న ఆరోపణలకు మాకు ఎలాంటి సంబంధం లేదు.
దయచేసి మాపై ఇలాంటి వార్తలు రాయొద్దు. ఆరోపణలు చెయ్యొద్దు. మీరు చేస్తున్న ఆరోపణల వలన నా ఫ్యూచర్, నా పిల్లల భవిష్యత్తు , కెరీర్, నా ఫ్యామిలీ ఆరోగ్యం ఇలా అన్ని రకాలుగా మేము చాలా ఎఫెక్ట్ అవుతున్నాం. ప్లీజ్ మమ్మల్ని అర్ధం చేసుకోండి అంటూ సురేఖ వాణి ఆ వీడియోలో ఈ డ్రగ్స్ కేసుతో మాకు ఎలాంటి సంబంధం లేదు అని ఇండైరెక్ట్ గా చెప్పేసింది.