సమంతతో నాగ చైతన్య విడిపోయాక మళ్ళీ హీరోయిన్ శోభిత దూళిపాళ్లతో డేటింగ్ చేస్తున్నాడంటూ.. వారు ఎక్కడ కనబడినా అదో సంచలనంగా మారుస్తూ, వీరిద్దరి పిక్స్ షేర్ చేస్తూ సోషల్ మీడియాలో హడావిడి చెయ్యడం చూసాం. మా మధ్యన ఏమి లేదు, సమంతకి నాకు మధ్యలో మూడో వ్యక్తిని బ్లేమ్ చెయ్యడం నాకు నచ్ఛలేదు అంటూ నాగ చైతన్య శోభిత పేరు ఎత్తకుండానే ఆ విషయంలో రియాక్ట్ అయ్యాడు. శోభిత కూడా చైతూతో రిలేషన్ లేదు అంటూ కుండబద్దలు కొట్టింది.
శోభిత దూళిపాళ్ల తాజాగా తన వ్యక్తిగత విషయాలను మీడియాతో పంచుకుంది. తాను అందంగా లేను అంటూ మోడలింగ్ చేసే సమయంలో చాలామంది తనని అవమానించేవారంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. అయితే శోభిత ఈ ఇంటర్వూస్ లోనే సమంత-నాగ ఛైతన్యలపై చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. అందులో సమంత గురించి మట్లాడుతూ.. సమంత కెరీర్ చాలా కూల్ గా కనిపిస్తుంది. ఆమె చేసిన సినిమాలు చూసినట్లయితే.. ఆమె కథల ఎంపిక, దానిని డీల్ చేసే విధానం బావుంటుంది.. అని చెప్పుకొచ్చింది.
ఇక నాగ చైతన్య గురించి అడగ్గానే.. అతను చాలా సైలెంట్ గా ఉంటాడు, ఎంతో ఒద్దికగా ఉంటాడు. నాగ చైతన్య స్వభావాన్ని మెచ్చుకుని తీరాల్సిందే అంటూ విడిపోయిన నాగ చైతన్య-సమంత లపై శోభిత దూళిపాళ్ల చేసిన కామెంట్స్ నెట్టింట్లో సంచలనంగా మారాయి.