దిల్ రాజుపై మెగా అభినులు ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు. అది ఏ రేంజ్ లో అంటే.. #UselessDilRajuShamelessSVC, WE WANT GAMECHANGER GLIMPSE, wake up shankar sir అనే హాష్ టాగ్స్ ట్రెండ్ చేసే అంత. ఇంతకీ దిల్ రాజు పై మెగా ఫాన్స్ కి అంతలా కోపం రావడానికి కారణం రామ్ చరణ్ తో దిల్ రాజు నిర్మిస్తున్న గేమ్ ఛేంజర్ రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇవ్వడం లేదు అంటూ మెగా ఫాన్స్ తెగ ఫైర్ అవుతున్నారు. దర్శకుడు శంకర్ అంతగా ఇండియన్ 2 షూటింగ్ తో బిజీగా వుంటుంటే.. అసలు గేమ్ ఛేంజర్ ని పట్టించుకోవడం లేదు, షూటింగ్ ఎంత కంప్లీట్ అయ్యిందో తెలియదు.
2024 సంక్రాంతికే రావలెనేది మా కోరిక అంటూ దిల్ రాజు అనడమే కానీ.. సంక్రాంతికి కానీ, 2024 సమ్మర్ కి కానీ గేమ్ ఛేంజర్ వచ్చే సూచనలు లేవు అంటూ సోషల్ మీడియాలో సవాలక్ష న్యూస్ లు. అసలు గేమ్ చెంజర్ 2024 లో ఉంటుందా.. లేదా.. అనేది ఇప్పుడు మెగా అభిమానుల అనుమానం. అందరూ హీరోలు డేట్స్ ఇచ్చేసి కూల్ గా షూటింగ్స్ చేస్తుంటే.. చరణ్ షూటింగ్ చేస్తున్నా.. గేమ్ ఛేంజర్ డేట్ ఇవ్వలేకపోవడానికి కారణం తెలియడం లేదు.
దానితో వారంతా దిల్ రాజు పై పడుతున్నారు. #UselessDilRajuShamelessSVC అంటూ SVC నిర్మాణ సంస్థతో పాటుగా దిల్ రాజుని నానా తిట్లు తిడుతూ ప్రష్టేషన్ ఫీలవుతున్నారు. మరి దిల్ రాజు-శంకర్ లు గేమ్ ఛేంజర్ డేట్ లాక్ చెయ్యపోతే పరిణామాలు తీవ్రంగా ఉండేలా కనబడుతున్నాయి.