మెగా ఫ్యామిలీలోకి చిన్న కోడలిగా వరుణ్ తేజ్ కి భార్యగా.. నాగబాబు కి కోడలిగా అడుగుపెట్టబోతున్న లావణ్య త్రిపాఠి ఎక్కడా తగ్గేదేలే అంటుంది. నిశ్చితార్ధం అయ్యింది.. ఇకపై లావణ్య త్రిపాఠి మెగా ఫ్యామిలి కోడలిగా మారిపోయినట్లే అని మెగా ఫాన్స్ అనుకుంటున్నారు. అలాగే సినిమాలకి కూడా లావణ్య త్రిపాఠి ఫుల్ స్టాప్ పెడుతుంది, నిర్మాత అవతారమెత్తుతుంది అంటూ ఏవేవో కథనాలు ప్రచారంలోకి వచ్చాయి. అంతేకాకుండా మెగా కోడలిగా అడుగుపెట్టబోయే లావణ్య ఇకపై గ్లామర్ చూపించదు అనుకున్నారు.
కానీ లావణ్య త్రిపాఠి మాత్రం గ్లామర్ ని వదలదు, సినిమాల్లో నటనని వదలదు అని ప్రూవ్ చెయ్యాలనుకుంటుందో ఏమో.. ఎందుకంటే జూన్ 9 న వరుణ్ తేజ్ తో ఎంగేజ్మెంట్ అయ్యాక కూడా లావణ్య స్టయిల్ గా గ్లామర్ గా రెడీ అయిన పిక్స్ వదులుతుంది. ఇటలీలో దిగిన ఓ గ్లామర్ పిక్ ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. గతంలో లావణ్య త్రిపాఠి తన బాయ్ ఫ్రెండ్ వరుణ్ తో కలిసి ఇటలీ వెకేషన్ కి వెళ్ళినప్పుడు సింగిల్ గా దిగిన పిక్ అది. లావణ్య త్రిపాఠి చాలా స్టయిల్ గా అందంగా కనిపించింది.
కాకపోతే మెగా ఫ్యామిలోకి వెళ్లే అమ్మాయి కాస్త పద్ధతిగా ఉంటే బావుంటుంది అని మెగా ఫాన్స్ ట్రోల్స్ చేయకుండా చూసుకో లావణ్యా అంటూ ఆమెకి చాలామంది సలహాలు ఇస్తున్నారు. మెగా ఫ్యామిలీ అంటే చిన్న ఫ్యామిలీ కాదు.. స్టార్ హీరోలు, మెగాస్టార్ లాంటి పెద్దలు ఉన్న ఇల్లు. ఉపాసన కొణిదెల ఎంతగా గ్లామర్ చూపించినా, ఆమె సినిమాల్లో కనిపించదు. కాని లావణ్య త్రిపాఠి వరుణ్ తో వివాహం తర్వాత కూడా నటిస్తే.. అది కూడా పద్దతి గల పాత్రల్లో కనిపిస్తే ఓకె.. లేదు గ్లామర్ గా కనబడతాను అంటే మెగా ఫాన్స్ ఒప్పుకోరేమో అంటూ లావణ్య ని భయపెట్టే వాళ్ళూ కూడా లేకపోలేదు.