హిందీలో డిసాస్టర్ ఎంట్రీ ఇచ్చినా.. సౌత్ లో అందులోనూ టాలీవుడ్ ఆమెని ఆదుకుంది. హరీష్ శంకర్ డీజే లో హీరోయిన్ గా ఛాన్స్ ఇచ్చాడు. ఆ సినిమాతోనే బికినీ వేసి అందరి చూపు తనవైపు పడేలా చేసుకున్న గ్లామర్ క్వీన్ పూజ హెగ్డే తర్వాత లక్కీ హీరోయిన్ గా మారింది. వరసగా స్టార్స్ హీరోలతో నటించింది. అల్లు అర్జున్, ఎన్టీఆర్, రామ్ చరణ్, మహేష్ బాబు, ప్రభాస్ ఇలా వరసగా స్టార్ ఛాన్సెస్ దక్కించుకుని గ్లామర్ తోనే లక్కీ హీరోయిన్ అనిపించుకుంది. పూజా హెగ్డే లేదంటే రష్మిక అన్న రేంజ్ లో టాలీవుడ్ లో కాంపిటీషన్ మొదలైంది.
అయితే గత ఏడాది పూజా హెగ్డే కి బ్యాడ్ ఇయర్ అని చెప్పాలి. వరస డిసాస్టర్ తో లక్కీ హీరోయిన్ కాస్త ఒకేసారి ఐరెన్ లెగ్ గా మారిపోయింది. రాధేశ్యామ్, బీస్ట్, ఆచార్య బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్స్ తో పూజాహెగ్డే కి సౌత్ లో చుక్కెదురైంది. పూజ హెగ్డే కి అటు హిందీలోనూ రెండు భారీ డిజాస్టర్స్ పడ్డాయి. సౌత్, హిందీ లోను రెండు చాలా ఆమెకి కలిసిరాలేదు. సర్లే అయితే అయ్యింది అనుకుంటే ఇప్పుడు మహేష్ మూవీ అయినా తనని ఆదుకుంటుంది అనుకుంది.. అందుకే గుంటూరు కారం సెట్స్ లోకి ఎంటర్ అయ్యేందుకు రెడీ అయ్యి పిఆర్వోలతో న్యూస్ లు ఇప్పించింది.
కట్ చేస్తే ఇప్పుడు క్రేజీ హీరయిన్ శ్రీలీల పూజ హెగ్డే ని కోలుకోలేని దెబ్బ తీసింది. మెల్లగా సౌత్ లోకి ఎంటర్ అయ్యి ఇప్పుడు హీరోయిన్ పూజా హెగ్డే ఛాన్స్ కొట్టేసి ఆమెకి డైరెక్ట్ స్పాట్ పెట్టింది. గుంటూరు కారం నుండి పూజా హెగ్డే ని తప్పించడానికి కారణం ఆమె డిసాస్టెర్స్, క్రేజ్ తగ్గడమేనట. అందుకే ఆమెని తప్పించి పూజ హెగ్డే ప్లేస్ లోకి శ్రీలీలని తెచ్చారట గుంటూరు కారం మేకర్స్. ఉన్న ఒక్క ఛాన్స్ కూడా పోవడంతో ఇప్పుడు పూజా హెగ్డేని అందరూ ఐరెన్ లెగ్ తో పోల్చడం మొదలెట్టేసారు.