వకీల్ సాబ్ కన్నా ముందే అల్లు అర్జున్ తో దర్శకుడు వేణు శ్రీరామ్ ఐకాన్ అనే ప్రాజెక్ట్ పై అధికారికారిక ప్రకటన కూడా ఇప్పించుకున్నాడు. దిల్ రాజు నిర్మాతగా వేణు శ్రీరామ్-అల్లు అర్జున్ కాంబోలో ఐకాన్ త్వరలోనే అంటూ ప్రీ లుక్ పోస్టర్ ని వదిలారు. కనబడుటలేదు అంటూ క్యాప్షన్ పెట్టిన ఈ ఐకాన్ కథ ఇప్పుడు అల్లు అర్జున్ నుండి నితిన్ కి చేరినట్టుగా ఓ న్యూస్ వినిపిస్తోంది. వకీల్ సాబ్ తర్వాత వేణు శ్రీరామ్ అల్లు అర్జున్ తో ఐకాన్ మొదలు పెడదామనుకుంటే ఈ ప్రాజెక్ట్ పై అల్లు అర్జున్ అంతగా ఇంట్రెస్ట్ చూపించలేదు. దానితో ఆల్మోస్ట్ ఆ ప్రాజెక్టు ఆగిపోయినట్లే అనుకున్నారు.
అల్లు అర్జున్ పుష్ప 1, ఇప్పుడు 2, తర్వాత సందీప్ వంగితో మరో ప్రాజెక్ట్ ని ఓకె చేసి ఐకాన్ ని పక్కన పడేసాడు. అయితే ఇప్పుడు వేణు శ్రీరామ్ ఇదే కథతో నితిన్ తో సినిమా చేసేందుకు సిద్ధమయ్యాడని అంటున్నారు. వేణు శ్రీరామ్-నితిన్-దిల్ రాజు కాంబోలో ఈ కథ పట్టాలెక్కే అవకాశం ఉంది అంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం మొదలైంది. వేణు శ్రీరామ్ తన ఐకాన్ కథ పట్ల ఎంతో నమ్మకంగా ఉండడంతో ఆ కథ అలా మరుగున పడకూడదనుకుని హీరోని వెతికే క్రమంలో దిల్ రాజు నితిన్ పేరుని సూచించినట్లుగా తెలుస్తుంది.
వకీల్ సాబ్ తర్వాత వేణు శ్రీరామ్ ఖాళీగానే ఉంటున్నాడు. నితిన్ మాత్రం వక్కంతంతో ఓ ప్రాజెక్ట్, వెంకీ కుడుములతో మరో ప్రాజెక్ట్ చేస్తున్నాడు. ఇక వేణు శ్రీరామ్ ఇటీవలే నితిన్‌కి వేణు కథ వినిపించాడు. తను పాజిటీవ్‌గానే స్పందించినట్టు తెలుస్తోంది.