యువగళం పాద యాత్రలో లోకేష్ జగన్ ప్రభుత్వం వలన ప్రజలు ఎదుర్కుంటున్న సమస్యలని ఎత్తి చూపుతూ.. YCP నేతలను చెడుగుడు ఆడుకుంటూ.. ప్రస్తుతం ఉమ్మడి అనంతపురం జిల్లాలో పాద యాత్ర కొనసాగిస్తున్నారు. లోకేష్ పాద యాత్రలో వేలాదిగా ప్రజలు పాల్గొంటున్నారు. భారీ బహిరంగ సభలతో టీడీపీ శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని తీసుకొస్తున్న లోకేష్ యువగళం పాదయాత్రలో ఆయన మేనమామ నందమూరి రామకృష్ణ పాల్గొన్నారు. మేనల్లుడు లోకేష్ కి పాద యాత్రలో అడుగడుగునా జన నీరాజనాలు అందుతున్నాయి, ఈసారి టిడిపి ప్రభుత్వమే ఏపీలో వస్తుంది.. జగన్ ప్రభుత్వ ఆగడాలను తిప్పికొట్టాలని రామకృష్ణ వ్యాఖ్యానించారు.
అయితే జూనియర్ ఎన్టీఆర్ టీడీపీలోనే ఉన్నారా అని మీడియా అడిగిన ప్రశ్నకి నందమూరి రామకృష్ణ బదులిస్తూ ఎన్టీఆర్ ఎప్పటికీ టీడీపీలోనే ఉంటాడు, జూనియర్ ఎన్టీఆర్ కట్టే కాలేవరకు టీడీపీలోనే ఉంటాడు అంటూ మాట్లాడారు. అంతేకాకుండా జూనియర్ ఎన్టీఆర్ వచ్చే ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేస్తారా అన్న ప్రశ్నకి రామకృష్ణ మాట్లాడుతూ.. ఆయన పలు సినిమా ప్రాజెక్ట్స్ తో బిజీగా వున్నాడు. ప్రస్తుతం ఈ ఎన్నికల్లో ఆయన ప్రచారం చేసే అవకాశం ఉండకపోవచ్చని క్లారిటీ ఇచ్చారు.
ఎన్టీఆర్ మాత్రం తాను టీడీపీ లో ఉన్నాడా.. లేదా.. అనే విషయమై క్లారిటీ ఇవ్వకుండానే.. రాజకీయాలపై ఇప్పుడప్పుడే మాట్లాడనని గత కొద్దిరోజులుగా తప్పించుకుంటున్న విషయం తెలిసిందే.