Advertisementt

OG: మైండ్ బ్లాక్ అయ్యిందంటున్న అర్జున్

Fri 23rd Jun 2023 07:19 PM
arjun das,og  OG: మైండ్ బ్లాక్ అయ్యిందంటున్న అర్జున్
Arjun Das blown away by OG OG: మైండ్ బ్లాక్ అయ్యిందంటున్న అర్జున్
Advertisement
Ads by CJ

పవన్ కళ్యాణ్ ఒరిజిన గ్యాంగ్ స్టర్ బరువు పెరిగిపోతుంది. ప్యాన్ ఇండియా లెవల్లో ఈ సినిమాని DVV దానయ్య తెరకెక్కిస్తున్నారు అంటే అవుననే అనిపిస్తుంది. మేకర్స్ నుండి క్లారిటీ లేకపోయినా.. ఆయన #OG కోసం తీసుకొస్తున్న నటులని చూస్తుంటే మాత్రం #OG ఖచ్చితంగా  ప్యాన్ ఇండియా మార్కెట్ లోకి వదులుతారు అనిపిస్తుంది. తమిళం నుండి శ్రీయ రెడ్డి, అర్జున్ దాస్ ని తీసుకొచ్చిన సుజిత్.. హిందీ నుండి ఇమ్రాన్ హాష్మిని తీసుకొచ్చాడు. ప్రస్తుతం #OG షూటింగ్ పవన్ కళ్యాణ్ తో పని లేని సీన్స్ ని సుజిత్ చిత్రీకరిస్తున్నాడు.

అయితే రీసెంట్ గా #OG సెట్స్ లోకి అడుగుపెట్టిన తమిళ నటుడు అర్జున్ దాస్.. #OG కి సంబంధించి ఇప్పటివరకు జరిగిన షూట్ మైండ్ బ్లోయింగ్ అంటూ ట్వీట్ చెయ్యడం పవన్ ఫ్యాన్స్ ని ఎగ్జైట్ చేస్తుంది. దర్శకుడు సుజిత్ సార్ నాకు OG సినిమా నుంచి కొన్ని విజువల్స్ చూపించారు.. ఆ విజువల్స్ చూసాక నా మైండ్ బ్లాక్ అయ్యింది అని చెప్పడమే కాకుండా పవన్ కళ్యాణ్ గారి స్క్రీన్ ప్రెజెన్స్, డైలాగ్స్, స్వాగ్ అదిరిపోయాయి అని అలాగే రవి కె చంద్రన్ గారి విజువల్స్ కూడా సూపర్బ్ అంటూ చెప్పిన అర్జున్ దాస్  పవన్ ఫ్యాన్స్ అసెంబుల్ అవ్వండి అంటూ మరింతగా హైప్ క్రియేట్ చేసాడు.

పవన్ కళ్యాణ్ #OG సెట్స్ లోకి చాలా స్టైలిష్ గా అడుగుపెట్టారు. ఆయన ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ లుక్ ఎలా ఉండబోతుందో అని ఫ్యాన్స్ ఎగ్జైట్ అవుతున్న సమయంలో అర్జున్ దాస్ #OG పై, పవన్ కళ్యాణ్ పై ఇలాంటి ట్వీట్ వెయ్యడం వారిని సర్ ప్రైజ్ చేసింది. ఇక ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన ప్రియాంక అరుళ్ మోహన్ నటిస్తుంది. 

Arjun Das blown away by OG:

Arjun Das on OG

Tags:   ARJUN DAS, OG
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ