Advertisementt

అక్కడ ఆపలేకపోయింది.. ఓటిటిలో ఆపేసింది

Fri 23rd Jun 2023 05:14 PM
naresh,malli pelli  అక్కడ ఆపలేకపోయింది.. ఓటిటిలో ఆపేసింది
Ramya Raghupathi Filed Case Against Malli Pelli OTT Streaming అక్కడ ఆపలేకపోయింది.. ఓటిటిలో ఆపేసింది
Advertisement
Ads by CJ

సీనియర్ నరేష్-పవిత్ర లోకేష్ జంటగా తెరకెక్కిన మళ్ళీ పెళ్లి నరేష్ వ్యక్తిగత జీవితం ఆధారంగా తెరకెక్కిన సినిమా. నరేష్ తన మూడో భార్య రమ్య రఘుపతి తో ఎలా ఇబ్బందిపడ్డాడో, పవిత్ర లోకేష్ తో పరిచయం, అలాగే పవిత్ర తన ఫస్ట్ భర్త తో ఎలా సతమతమైంది, వీరిద్దరిని రమ్య రఘుపతి ఎంతెలా టార్చర్ చేసి ఇబ్బందులు పాలు చేసిందో అనేది నరేష్ మళ్ళీ పెళ్లి రూపంలో గత నెలలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడమే కాదు.. ఆ సినిమా ప్రమోషన్స్ లో నరేష్-పవిత్రలు చేసిన ఓవరేక్షన్ అందరికి చిరాకు తెప్పింది.

అయితే థియేటర్స్ లో రేపు విడుదల కాబోతున్న సమయంలో మళ్ళీ పెళ్లి చిత్రంపై నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి కోర్టులో కేసు వేసింది. తన వ్యక్తిగత జీవితానికి భంగం వాటిల్లేలా మళ్ళీ పెళ్లి సినిమా చేసారంటూ కేసు వేసిన కొద్ది గంటల్లోనే నరేష్ ఆ కేసు ని సాల్వ్ చేసుకుని మళ్ళీపెళ్లిని థియేటర్స్ లో విడుదల చేసారు. థియేటర్స్ లో సో సో గా నడిచిన మళ్ళీ పెళ్లి నేడు జూన్ 23 న ఓటిటిలోకి రావాల్సి ఉంది. అమెజాన్ ప్రైమ్, ఆహా ఓటిటీల నుండి మళ్ళీ పెళ్లి విడుదల కావాల్సి ఉండగా.. రమ్య రఘుపతి లీగల్ నోటీసులు పంపించడంతో అమెజాన్ ప్రైమ్ మళ్ళీ పెళ్లి స్ట్రీమింగ్ ఆపేసింది. అయితే, ఆహాలో మాత్రం ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. 

అప్పట్లో ఈ సినిమాలో తనను విలన్ గా చూపించారని రమ్య రఘుపతి కోర్టుకెక్కింది. అయినా సినిమా విడుదల ఆపలేకపోయింది. కానీ ఓటిటిలో మాత్రం రమ్య లీగల్ నోటీసులతో మళ్ళీ పెళ్లి స్ట్రీమింగ్ ని ఆపేసారు. రమ్య రఘుపతి అమెజాన్ ప్రైమ్, ఆహా ఓటీటీలకు లీగల్ నోటీసులు పంపించగా.. నోటీసులు అందుకున్న అమెజాన్.. మళ్లీ పెళ్లి సినిమా విషయంలో వెనుకడుగు వేయగా, ఆహా మాత్రం స్ట్రీమింగ్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది.

Ramya Raghupathi Filed Case Against Malli Pelli OTT Streaming:

Naresh ex wife moves to court to stop Malli Pelli OTT release

Tags:   NARESH, MALLI PELLI
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ