Advertisementt

పవన్ ఫ్యాన్స్ తిడుతున్నారు: ముద్రగడ

Fri 23rd Jun 2023 03:50 PM
mudragada padmanabham,pawan kalyan  పవన్ ఫ్యాన్స్ తిడుతున్నారు: ముద్రగడ
Mudragada Padmanabham letter to Pawan Kalyan పవన్ ఫ్యాన్స్ తిడుతున్నారు: ముద్రగడ
Advertisement
Ads by CJ

కాపు నాయకుడిగా, కాపు సామాజిక వర్గ రిజర్వేషన్ల కోసం ఎన్నో పోరాటాలు చేశానంటూ చెప్పుకునే ముద్రగడ పద్మనాభం కొన్నాళ్లుగా సైలెంట్ మోడ్ లో ఉండి.. పవన్ వారాహి యాత్ర తూర్పు గోదావరిలో మొదలు కాగానే.. ఆయన కూడా యాక్టీవ్ అయ్యి కాపు ఉద్యమాన్ని నెత్తినెట్టుకున్నారు. పవన్ కళ్యాణ్ పై ఫైర్ అవుతూ పవన్ కి నాయకత్వ లక్షణాలు లేవంటూ ఆయనపై లేఖాస్త్రాలు సంధిస్తున్నారు. పవన్ కళ్యాణ్ కాపులకు ఏమి చేయలేదంటూ ఆయన తన లేఖలో ఘాటుగా విమర్శిస్తూ పవన్ కళ్యాణ్ ని కించపరిచే విధంగా రాతలు రాయడం జనసైనికులకి ముఖ్యంగా పవన్ ఫాన్స్ కి నచ్ఛలేదు.

అయినా వారు మారు మాట్లాడకుండా పవన్ కళ్యాణ్ వారాహి యాత్రని విజయవంతం చేసి పనిలో నిమగ్నమయ్యారు. అయితే పవన్ కళ్యాణ్ ఫాన్స్ తనని తిడుతున్నారు, పవన్ కూడా తిడుతున్నారు, నేను అతన్ని విమర్శిసిస్తూ లేఖ రాయడం తప్పైపోయింది. కావాలనే తన ఫ్యాన్స్ తో తనని తిట్టిస్తూ మెసేజెస్ పంపేలా పవన్ చేస్తున్నారు.. వారు ఎంత తిడితే నాకు అంత ఊపొస్తుంది.. వాళ్ళని ఏకి పడేస్తాను అంటూ ముద్రగడ మరోసారి పవన్ కళ్యాణ్ పై లేఖ సంధించారు. కాకినాడ నుంచి కాకుంటే పిఠాపురం నుంచి పోటీ చేయగలరా.. చేస్తే తనను పోటీకి రమ్మని సవాల్ చేయగలరా.. నేనేమి మీదగ్గర నౌకరి చెయ్యడం లేదు.

నాకు మీకు సంబంధం ఏమిటి, నేను మీకు తొత్తులుగా పని చెయ్యాలా.. నన్నేమన్నా పడతానన్న గర్వమా.. కాపుల గురించి మాట్లాడే నైతిక హక్కు మీకుందా.. నేను కాపుల కోసం పోరాడడం లేదా.. మీ సినిమాలు రిలీజ్ అయితే ఫ్యాన్స్ కి వేలాది రూపాయల ఖర్చెందుకు. నన్ను రెచ్చగొట్టి పోటీకి పిలుస్తున్నారు.. మీవాళ్ళతో ఎందుకు తిట్టిస్తున్నారు అంటూ పవన్ కి లేఖ రాసారు ముద్రగడ. మరి ముద్రగడ లేఖపై పవన్ ఏవిధంగా రియాక్ట్ అవుతారో చూడాలి. 

Mudragada Padmanabham letter to Pawan Kalyan:

Mudragada Padmanabham vs Pawan Kalyan

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ