రాజమౌళి తో సినిమాలు చేసి హిట్ కొట్టే హీరోలు గ్లోబల్ వైడ్ గా ఎంతగా పేరు తెచ్చుకున్నప్పటికీ వారి తదుపరి చిత్రాల విషయంలో మాత్రం అభిమానులని చాలా డిస్పాయింట్ చేస్తున్నారు. రాజమౌళి తో సినిమా చేసాక చాలా సినిమాల ప్లాప్ లని ఎదుర్కుంటున్నారు. ప్రభాస, రామ్ చరణ్, ఎన్టీఆర్, రవితేజ, నితిన్ ఇలా ప్రతి హీరో రాజమౌళి ప్రాజెక్ట్ తర్వాత వరస వైఫల్యాలతో సఫర్ అయిన వారే. సింహాద్రి హిట్ తర్వాత యమదొంగ వరకు రిలీఫ్ దొరకలేదు ఎన్టీఆర్ కి. విక్రమార్కుడు తర్వాత ఎంతోకాలానికి గాని మళ్ళీ హిట్టు పైన పట్టు దక్కలేదు రవితేజకి. నితిన్ కి సై సినిమా తర్వాత ఎన్నో ఏళ్ళ పాటు ఎన్నో సినిమాలకు శ్రమిస్తేనే తప్ప ఇష్క్ అనేది దక్కలేదు. బాహుబలితో ప్యాన్ ఇండియా రేంజ్ హిట్ కొట్టిన ప్రభాస్ ఆ తర్వాత వరసగా మూడు ప్లాప్ లు చవి చూసాడు.
బాహుబలి మ్యానియాతో సాహో ని ఆదరించిన నార్త్ ప్రేక్షకులు తర్వాత వచ్చిన రాధేశ్యామ్, ఆదిపురుష్ చిత్రాలను త్రిరస్కరించారు. అది కేవలం రాజమౌళి సినిమా ప్రభావమనే మాట సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆయనతో కలిసి ఎంతగా ప్రశంశలు పొందుతారో ఆ తర్వాత అంతే నెగిటివిటీని మొయ్యాల్సి వస్తుంది అంటున్నారు. ఆర్.ఆర్.ఆర్ తర్వాత రామ్ చరణ్ కి ఆచార్య బిగ్గెస్ట్ షాక్ ఇచ్చింది. ఆచార్య అట్టర్ ప్లాప్ చరణ్ ని ఆయన ఫాన్స్ ని డిస్పాయింట్ చేసింది. ఇక రాబోయే గేమ్ ఛేంజర్ ఎలా ఉండబోతుందో మెగా అభిమానులు అంచనా వేయలేకపోతున్నారు.
ఇప్పుడు తారక్ అభిమానుల వంతు వచ్చేసింది. ఆర్ ఆర్ ఆర్ తర్వాత ఎన్టీఆర్ ఆచి తూచి దేవరతో సెట్స్ మీదకి వెళ్ళాడు. కొరటాల ఏడాది కాలంగా దేవర స్క్రిప్ట్ పై వర్క్ చేసి మరీ ఆ చిత్రాన్ని పట్టాలెక్కించాడు. అయితే ఇప్పుడు ప్రభాస్ ఆదిపురుష్ పోవడంతో అటు రాజమౌళి సెంటిమెంట్ పై తారక్ అభిమానులు ఆందోళన పడుతుంటే.. ఇటు ఆదిపురుష్ లో విలన్ కేరెక్టర్ లో ఫెయిల్ అయిన సైఫ్ అలీ ఖాన్ విషయంలో మరింతగా కంగారు పడుతున్నారు.
ప్యాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కిన ఆదిపురుష్ విడుదలైన అన్ని భాషల్లో తేలిపోయింది. ముఖ్యంగా రావణుడిగా సైఫ్ తేలిపోయాడనే విమర్శలు వెల్లువెత్తాయి. ఇప్పుడు ఎన్టీఆర్ దేవరకి సైఫ్ ఎఫెక్ట్ ఏమైనా పడుతుందా.. అసలు సైఫ్ ఎన్టీఆర్ కి విలన్ గా సరిపోతాడా.. కొరటాల ఏం చేస్తారో కానీ.. ఇప్పుడు ఈ విషయంలో తారక్ ఫాన్స్ మాత్రం వణికిపోతున్నారు.