బోల్డ్ యాక్ట్రెస్ శృతి హాసన్ ఏదైనా ఓపెన్ గా మాట్లాడానికి ఇష్టపడుతుంది. గుట్టుగా ఏది దాచాలనుకోదు. కెరీర్ విషయమైనా ఏదైనా ఓపెన్ గానే వుంటుంది. వ్యక్తిగత విషయాలను కూడా అందరి ముందు పెట్టే శృతి హాసన్ బాయ్ ఫ్రెండ్ తో కూడా సీక్రెట్ మెయింటింగ్ చెయ్యదు. మీడియాకి తెలిసేలా బిహేవ్ చేస్తుంది. చట్టాపట్టాలేసుకుని తిరుగుతూనే ఫొటోలకి ఫోజులిస్తుంది. అలాగే ఆరోగ్యపరమైన సమస్యలతో పోరాడుతున్నా వాటిని కూడా ఎలాంటి మొహమాటం లేకుండా రివీల్ చేస్తుంది.
శృతి హాసన్ పై చాలామందిలో చాలా డౌట్స్ ఉన్నాయి. ముఖ్యంగా ఆమె మద్యం సేవిస్తుంది అంటూ చాలాసార్లు సోషల్ మీడియాలో ఆమెపై రూమర్స్ వినిపించాయి. అలాగే సిగరెట్ కూడా కాలుస్తుంది అంటూ రకరకాల వార్తలు ఆమెపై చక్కర్లు కొట్టాయి.
అయితే ఎప్పటికప్పుడు అభిమానులతో మంచి ర్యాపొ మెయింటింగ్ చేసే శృతి హాసన్ తరుచూ వారితో ముచ్చట్లు పెడుతుంది. తాజాగా శృతి హాసన్ అభిమానులతో చిట్ చాట్ చేసింది. అందులో వారు శృతి హాసన్ ని రకరకాల ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసారు. ఓ అభిమాని శృతి హాసన్ ని డైరెక్ట్ గా మందు తాగుతారా అని అడిగేశాడు. దానికి శృతి హాసన్ తనకి మందు అలవాటే కాదు, ఎలాంటి మారక ద్రవ్యాల తీసుకునే అలవాట్లు లేవు.. అలాగే తాను లైఫ్ ని హుందాగా గడిపే వ్యకిని అంటూ చెప్పుకొచ్చింది.
ఈ ఏడాది శృతి హాసన్ వాల్తేర్ వీరయ్య-వీరసింహారెడ్డి సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్ కొట్టిన ఆమె ప్రభాస్ తో సలార్ లాంటి ప్యాన్ ఇండియా మూవీలో నటిస్తూ క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది.