యంగ్ హీరో రామ్ ని రెడ్, ద వారియర్ చిత్రాలు నిరాశ పరచడంతో.. ఆయన మాస్ అండ్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ బోయపాటితో చేతులు కలిపి ప్యాన్ ఇండియా మార్క్ ట్లొకి అడుగుపెట్టేందుకు భారీ బడ్జెట్ తో ఓ మూవీని మొదలు పెట్టాడు. #BoyapatiRapo అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ మూవీకి అస్లు టైటిల్ ఇంకా ప్రకటించలేదు. అయితే రామ్ -బోయపాటి తమ చిత్రాన్ని దసరా రిలీజ్ అంటూ రామ్ ఫస్ట్ లుక్ తోనే ప్రకటించారు. కానీ అప్పుడు డేట్ ఖచ్చితంగా చెప్పలేదు.
అయితే ఇప్పుడు దసరా బరిలో బాలయ్య బాబు భగవంత్ కేసరి, రవితేజ టైగర్ నాగేశ్వరరావు లు పోటీకి వస్తూ ఉండడంతో రామ్-బోయపాటి తమ చిత్రాన్ని సెప్టెంబర్ లోనే విడుదలకు రెడీ చేసేసారు. నేడు రామ్ పంచె కట్టు లుక్ తో పాటుగా #BoyapatiRapo సెప్టెంబర్ 15 రిలీజ్ అంటూ అఫీషియల్ గా రిలీజ్ డేట్ ప్రకటించారు. రామ్ బర్త్ డే కి వదిలిన #BoyapatiRapo టీజర్ తోనే సినిమాపై భారీ అంచనాలు పెంచేయగా.. ఈ చిత్రంలో లక్కీ హీరోయిన్ శ్రీలీల రామ్ తో జోడి కడుతూ ఉండడంతో ఆ హైప్ మరికాస్త పెరిగింది.
ఈమధ్యనే హై వోల్టేజ్ క్లైమాక్స్ సన్నివేశాలు కంప్లీట్ చేసినట్లుగా రామ్ సోషల్ మీడియా ద్వారా మాస్ అప్ డేట్ ఇచ్చాడు. తాజాగా ఈ చిత్రానికి ప్యాన్ ఇండియా లెవల్లో రిలీజ్ డేట్ కూడా వచ్చేసింది.