ప్రస్తుతం ఏపీలో YCP ప్రభుత్వం ఎప్పుడు వెళ్లిపోతుందా అని ప్రజలు ఎదురు చూస్తున్నారు. జగన్ ప్రభుత్వంలో ప్రతి ఒక్క వర్గం వారు సఫర్ అవుతున్నారు. రోడ్లు వెయ్యక, కరెంట్ సక్రమంగా లేక, ఉద్యోగాలు రాక, జీతాలు సరిగ్గా ఇవ్వక ఇలా ప్రతి ఒక్క విషయంలోనూ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఒక్క అవకాశం ఒకే ఒక్క అవకాశం తమ కొంప ముంచేసింది అని తిట్టుకోని వారు లేరు. పథకాలను ఉచితంగా అందిస్తూ కొంతమంది ప్రజలని జగన్ ప్రభుత్వం సోమరిపోతులుగా మార్చేసింది. చంద్రబాబు నాయుడు వస్తే ఏం చేసేవాడో తెలియదు కానీ.. జగన్ ప్రభుత్వంలో జనాలు నరకయాతన అనుభవిస్తున్నారంటూ అక్కడి టివి ఛానల్స్, వార్త పత్రికలూ ప్రముఖంగా ప్రచురిస్తూనే ఉన్నాయి.
తాజాగా వారాహి యాత్రలో పవన్ కళ్యాణ్ ప్రజలకి పదే పదే అదే చెబుతూ వస్తున్నాడు. మరోపక్క లోకేష్ పాద యాత్రలోను వైసీపీ ఆగడాలను, వైసీపీ ప్రభుత్వ చేతకాని తనాన్ని ఎండకడుతున్నాడు. పలు కంపెనీలు వెనక్కి వెళ్లిపోవడంతో నిరుద్యోగం రాజ్యమేలుతుంది. పనుల్లేక జనాలు ఖాళీగా కనబడుతున్నారు. చీప్ లిక్కర్ తో ఆరోగ్యం నాశనం చేసుకుంటున్నారు. ఇటు లోకేష్ పాదయాత్ర, చంద్రబాబు ప్రజా యాత్ర, పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర ముప్పేట దాడితో వైసీపీ నేతలు వాళ్ళని వాళ్ళు కాపాడుకోవడానికే సమయం సరిపోతుంది. పేర్ని నాని, కొడాలి నాని లాంటోళ్ళు మంత్రి పదవులు ఊడగొట్టుకుని నోటికి పని చెబుతున్నారు. ప్రస్తుతం ఏపీలో గందరగోళ పరిస్థితులు రాజ్యమేలుతున్నాయి.
ఏపీ ప్రజలంతా ముఖ్యంగా జనసైనికులు బై బై వైసీపీ అంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. నిన్న గురువారం నుండి ట్విట్టర్ హ్యాండిల్ లో #HelloAP_ByeByeYCP హాష్ ని ట్రెండ్ చేస్తున్నారు. జగనన్న దీవెన, జగనన్న భరోసా ఇలా ఎన్ని పథకాలు పెట్టినా ప్రజలకు నచ్చడం లేదు.. ఈ ప్రభుత్వం ఎప్పుడు గద్దె దిగుతుందా అని వెయిట్ చెయ్యడమే కాదు.. అవకాశం ఉన్నప్పుడల్లా ఇలా సోషల్ మీడియాలో #HelloAP_ByeByeYCP లాంటి హాష్ టాగ్స్ ట్రెండ్ చేస్తున్నారు. మరి వచ్చే ఎన్నికల్లో జగన్, వైసీపీ ప్రభుత్వ భవితవ్యం ఏమిటో చూద్దాం.