గత వారం రోజులుగా రష్మిక మందన్నని ఆమె మేనేజర్ మోసం చేసాడు, రష్మిక నుండి 80 లక్షల రూపాయలు పెద్ద మొత్తంలో కాజేసాడనే న్యూస్ సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొట్టింది. తర్వాత రష్మిక మేనేజర్ విషయంలో కఠిన నిర్ణయం తీసుకుంది, ఇకపై మేనేజర్ ని తీసేసి తన పని తాను ఒంటరిగా మేనేజ్ చేసుకుంటుంది అంటూ ఏవేవో న్యూస్లు చక్కర్లు కొట్టినా రష్మిక మాత్రం ఈ విషయంపై రియాక్ట్ అవ్వకుండానే కామ్ గా ఉండిపోయింది.
తాజాగా రష్మిక మందన్న తన మేనేజర్ తో ఇక కలిసి పనిచేయడం లేదనే విషయంపై వస్తున్న వార్తలకి, మేనేజర్ తో విబేధాల కారణంగానే రష్మిక ఆయనతో వర్క్ చేయడం లేదంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో.. ఆ రూమర్స్ పై రష్మిక స్పందించింది. తాను తన మేనేజర్ ఇకపై విడిగా పని చేయాలని నిర్ణయించుకోవడం వెనక ఎలాంటి గొడవలు లేవని తెలిపింది.
అంతేకాకుండా తాను, తన మేనేజర్ ఆరోగ్యకర వాతావరణంలో కలిసి పనిచేశాం. పరస్పర ఒప్పందంతో విడిగా కెరీర్ లో ముందుకు సాగాలని నిర్ణయించుకున్నాం. ప్రొఫెషనల్ గా ఉండే వాళ్లం కాబట్టి అలాగే కలిసి వర్క్ చేశాం. ఇప్పుడు అంతే హుందాగా విడిగా పని చేయాలని అనుకుంటున్నాం అని రష్మిక, ఆమె మేనేజర్ తాజా ప్రకటనలో తెలిపారు.