Advertisementt

ప్రాజెక్ట్ K అసలు టైటిల్ రాబోతోందా?

Thu 22nd Jun 2023 07:34 PM
project k  ప్రాజెక్ట్ K అసలు టైటిల్ రాబోతోందా?
Project K extravaganza in overseas ప్రాజెక్ట్ K అసలు టైటిల్ రాబోతోందా?
Advertisement
Ads by CJ

నాగ్ అశ్విన్-ప్రభాస్ కలయికలో ప్యాన్ వరల్డ్ మూవీ గా తెరకెక్కుతున్న ప్రాజెక్ట్ K మూవీ జనవరి 12, 2024 లో విడుదల కాబోతున్నట్టుగా ఈ మహాశివత్రి రోజున ప్రకటించారు. భారీ బడ్జెట్ తో భారీగా తెరకెక్కుతున్న ప్రాజెక్ట్ K లో దీపికా పదుకొనే, దిశా పటాని, అమితాబచ్చన్ లు కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న ప్రాజెక్ట్ K టైటిల్ కానీ, ఫస్ట్ లుక్ కానీ ఇంతవరకు రివీల్ చెయ్యలేదు. ప్రభాస్ చేతిని, అమితాబ్ చేతిని మాత్రం ప్రీ లుక్స్ గా వదిలారు తప్ప ఫస్ట్ లుక్స్ మాత్రం వదల్లేదు.

అయితే తాజాగా ప్రాజెక్ట్ K నుండి టైటిల్ రాబోతున్నట్టుగా ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ప్రాజెక్ట్ K అనేది వర్కింగ్ టైటిల్ మాత్రమే. దీనికి అసలైగా అధికార టైటిల్ వదిలేందుకు మేకర్స్ సిద్ధమయ్యారని అది కూడా మోషన్ పోస్టర్ తో పాటుగా విడుదల చెయ్యాలని చూస్తున్నారట. అయితే ప్రాజెక్ట్ K టైటిల్ ని ఇండియాలో కాకుండా యునైటెడ్ స్టేట్స్‌లో విడుదల చేయనున్నారు అని తెలుస్తోంది. దీని కోసం జులై లో మంచి తేదీని ఫిక్స్ చెయ్యబోతున్నారంటూ ప్రభాస్ ఫాన్స్ సోషల్ మీడియాలో హడావిడి మొదలు పెట్టారు.

సైన్స్ ఫిక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రభాస్ సూపర్ మ్యాన్ తరహాలో కనిపించబోతున్నట్లుగా ఎప్పటినుండో ప్రచారం జరుగుతుంది. ఇక ప్రాజెక్ట్ K వర్కింగ్ వీడియోస్ ని నాగ్ అశ్విన్ దశలవారీగా వదులుతూ సినిమాపై అంచనాలు క్రియేట్ చేస్తూ వస్తున్నాడు. 

Project K extravaganza in overseas:

Project K extravaganza planned

Tags:   PROJECT K
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ