ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్-కృతి సనన్ కాంబోలో ఓమ్ రౌత్ తెరకెక్కించిన ఆదిపురుష్ జూన్ 16 న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయ్యి థియేటర్స్ లో నెగెటివ్ టాక్ తో రన్ అవుతుంది. అంతేకాకుండా ఆదిపురుష్ కాంట్రవర్సీలకి కేరాఫ్ గా మారింది. ఆదిపురుష్ కి ఎంతటి నెగెటివ్ టాక్ వచ్చినా మొదటి మూడు రోజులు కలెక్షన్స్ పరంగా కుమ్మేసినప్పటికీ.. ఆదిపురుష్ వీక్ డేస్ మొదలు కాగానే వీక్ అయ్యింది. అయితే ఈ చిత్రంలో సీత గా నటించిన కృతి సనన్ ఇప్పుడు ఓ మల్టిప్లెక్స్ థియేటర్ లోని ఓ షో కి సంబందించిన టికెట్స్ మొత్తం బుక్ చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది.
ఢిల్లీ లోని ఓ మల్టిప్లెక్స్ లో థియేటర్ మొత్తం అంటే 300 టికెట్స్ ని కృతి సనన్ బుక్ చేసినట్లుగా తెలుస్తుంది. ఆ టికెట్స్ తో తాను చదివిన ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పిల్లలకి ఆదిపురుష్ చిత్రాన్ని చూపించబోతుందట. ఆ పిల్లలతో పాటుగా కృతి సనన్ తన ఫ్యామిలీ ని కూడా మరోసారి ఆదిపురుష్ మూవీకి తీసుకెళ్లబోతుంది అని తెలుస్తుంది. కృతి సనన్ కి ఆమె చదివిన ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అంటే చాలా ఇష్టమంటూ పలు సందర్భాల్లో చెప్పింది.
ఇప్పుడు అదే స్కూల్ పిల్లల కోసం ఆదిపురుష్ షో కి టికెట్స్ బుక్ చెయ్యడం బాలీవుడ్ మీడియా ప్రత్యేకంగా కవర్ చేస్తుంది.