Advertisementt

LEO లో విజయ్ లుక్ చూసారా..

Thu 22nd Jun 2023 09:13 AM
leo first look  LEO లో విజయ్ లుక్ చూసారా..
Leo first look: Ferocious and Menacing LEO లో విజయ్ లుక్ చూసారా..
Advertisement
Ads by CJ

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ బర్త్ డే నేడు. దళపతి పుట్టిన రోజు అంటే ఆయన అభిమానులకి పండగ రోజు. ప్రస్తుతం తమిళనాట భారీ డిమాండ్ ఉన్న హీరో విజయ్. సూపర్ స్టార్ రజినీకాంత్ కూడా వరస వైఫల్యాలతో సతమతమవుతున్నారు, పారితోషకం పరంగా రజినీకాంత్ టాప్ లో ఉన్నప్పటికీ.. మార్కెట్ పరంగా విజయ్ టాప్ అని చెబుతారు. అయితే విజయ్ పుట్టినరోజు సందర్భంగా నేడు ఆయన నటిస్తున్న LEO నుండి ఫస్ట్ లుక్ వదిలారు. లోకేష్ కనగరాజ్ తో సెకండ్ ఫిల్మ్ చేస్తున్న విజయ్ ని LEO గా కొత్తగా కాదు భయానకంగా చూపించాడు లోకేష్.

విజయ్ సుత్తి పట్టుకొని విలన్స్ తో ఫైట్ చేస్తున్నట్టు ఉంది. విజయ్ లుక్ చాలా క్రూయెల్‌గా ఉంది. ఆగ్రహంతో సుత్తితో విలన్ పళ్లు రాళ్లగొడుతున్నట్లుగా.. ఆ పళ్ళు ఎగిరిపడుతున్నట్టుగా ఆ పోస్టర్‌లో ఉన్న దృవపు ఎలుగుబంటి విజయ్ పాత్రను ప్రతిబింబించేలా కనిపిస్తుంది. విజయ్ ని లోకేష్ కనగరాజ్ చాలా పవర్ ఫుల్ గా చూపించాడు.. ఇప్పటికే భారీ అంచనాలున్న LEO పై ఇపుడు ఈ ఫస్ట్ లుక్ ఇంత మాస్ గా ఉండటంతో మరిన్ని అంచనాలు పెరిగాయి. ఇది లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగానే తెరకెక్కుతుంది. 

అయితే ఈ ఫస్ట్ లుక్ లో విజయ్ ఫైట్ చేస్తుంది.. రోలెక్స్ గ్యాంగ్ మీదే అంటూ విజయ్ ఫాన్స్ ఊహించేసుకుంటున్నారు. విక్రమ్ లోనే రోలెక్స్ కేరెక్టర్ పై ఓ భయానకమైన పరిచయంతో ముగించాడు లోకేష్. మరి LEO లో ఆ రోలెక్స్ ముఠాతో ఎమన్నా లింక్ ఉందేమో చూద్దాం. ప్రస్తుతం విజయ్ LEO ఫస్ట్ లుక్ సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ చేస్తున్నారు దళపతి ఫాన్స్. 

Leo first look: Ferocious and Menacing:

Leo first look out

Tags:   LEO FIRST LOOK
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ