Advertisementt

రెడ్ అవుట్ ఫిట్ లో కియారా అందాలు

Wed 21st Jun 2023 07:43 PM
kiara advani  రెడ్ అవుట్ ఫిట్ లో కియారా అందాలు
Kiara Advani looks beautiful in a red outfit రెడ్ అవుట్ ఫిట్ లో కియారా అందాలు
Advertisement
Ads by CJ

కియారా అద్వానీ తెలుగు పేక్షకులకి పరిచయం అక్కర్లేని పేరు. ప్రస్తుతం బాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిన కియారా అద్వానీ సౌత్ లో తనకి మొదటి సినిమాతోనే బిగ్గెస్ట్ ప్లాప్ అందించిన రామ్ చరణ్ తో మరోసారి గేమ్ ఛేంజర్ మూవీలో నటిస్తుంది. హిందీ, తెలుగు, తమిళం ఇలా మూడు లాంగ్వేజెస్ లో ఈ మూవీ తెరకెక్కుతుండగా.. ఇప్పుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ హిందీ లోకి ఎంట్రీ ఇస్తున్న వార్ 2 లో కియారా హీరోయిన్ గా ఎంపికైంది అంటూ బాలీవుడ్ మీడియా కోడై కూస్తుంది. 

కెరీర్ లో అలా ఉంటే.. ఈ ఏడాది తన ప్రేమికుడు సిద్దార్థ్ మల్హోత్రాతో ఏడడుగులు నడిచి ఓ ఇంటికి కోడలైన కియారా అద్వానీ.. పెళ్లి తర్వాత జరగాల్సిన ముచ్చట్లు జరిపించేసుకుని వెంటనే షూటింగ్స్ లో వాలిపోయింది. పెళ్లయినా తగ్గేదేలే అన్నట్టుగా కియారా అద్వానీ గ్లామర్ విషయంలో మరింతగా చెలరేగిపోతుంది. భర్త సిద్దార్థ్ తో కలిసి వెకేషన్స్ కి వెళ్ళినా షూటింగ్స్ కి గ్యాప్ ఇవ్వడం లేదు. తాజాగా కియారా అద్వానీ రెడ్ కలర్ అవుట్ ఫిట్ లో గ్లామర్ గా అదరగొట్టేసింది. 

లూజ్ హెయిర్ లో అందాలు ఎలా చూపిస్తే యూత్ పడిపోతారో అలానే చూపిస్తూ.. మత్తెక్కించే చూపులతో మెస్మరైజ్ చేసింది. కియారా అద్వానీ రెడ్ అవుట్ ఫిట్ లుక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయి. మరి మీరు కూడా కియారా అద్వానీ రెడ్ డ్రెస్ పిక్స్ ని ఓ లుక్కెయ్యండి. 

Kiara Advani looks beautiful in a red outfit:

Kiara Advani Glamorous look in red outfit

Tags:   KIARA ADVANI
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ