మెగాస్టార్ చిరంజీవి తాతగా ప్రమోషన్ పొందారు. ఆయన తన కుమార్తెల కూతుళ్ళకి ఎప్పుడో తాతయినా.. ఇప్పుడు రామ్ చరణ్ బిడ్డకి తాతగా మారారు. ఇప్పటికీ మెగాస్టార్ చిరంజీవి హీరోయిజం ఎలివేట్ చేసే సినిమాల్లోనే కనిపిస్తున్నారు. అయితే రామ్ చరణ్-ఉపాసనలు పదకొండేళ్ల తర్వాత తమ చేతుల్లోకి చంటి బిడ్డని ఎత్తుకోవడంతో సీలెబ్రిటీస్ అంతా చరణ్ దంపతులకి సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఎన్టీఆర్ దగ్గర నుండి అల్లు అర్జున్, లావణ్య త్రిపాఠి ఇలా అందరూ రామ్ చరణ్-ఉపాసనలకు విషెస్ చెప్పారు.
అయితే తాజాగా ఏపీ మినిస్టర్, మాజీ హీరోయిన్ రోజా.. మెగాస్టార్ చిరుకి, రామ్ చరణ్ కి సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతూ.. తాత గా ప్రమోట్ అయిన చిరంజీవి గారికి నా హృదయపూర్వక అభినందనలు. ఎప్పుడూ యంగ్ గా, శక్తివంతంగా ఉండే మీ కుటుంబానికి మెగా ప్రిన్స్ రూపంలో ఆ భగవంతుడు ఆశీర్వాదాన్ని అందించాడు. రామ్ చరణ్.. చిన్నప్పుడు నిన్ను నా చేతుల్లోకి తీసుకున్న ఆ క్షణాలు ఇంకా గుర్తున్నాయి. ఇప్పుడు నీకో పాప పుట్టింది అన్న వార్త విని చాలా సంతోషం వేసింది.
చిరంజీవి సర్.. మీరు తాతయ్య అయినా మాకు ఎప్పటికీ హీరోనే. ఉపాసనా మీ ఇంటి చిన్న మహాలక్ష్మికి ఇవే నా ఆశీస్సులు అంటూ రోజా చిరుకి, రామ్ చరణ్-ఉపాసన దంపతులకి తన శుభాకాంక్షలను తెలియజేసారు.
రోజా ట్వీట్..
My heartiest congratulations to @KChiruTweets garu on becoming a grandfather. It is a blessing by Almighty to this ever young at heart and always blooming with an energy personality to be blessed with a lovely #MegaPrincess in the family. Dear @AlwaysRamCharan I recollect those memorable days when I used to cuddle you in my arms as a baby & now to hear the happy news that you are blessed with a daughter is even happier. Chiranjeevi sir, you are an evergreen hero even with the prestigious title of a grandfather. My blessings to @upasanakonidela & little Mahalakshmi of your house with prayers for her well being and prosperity of the family.