నిన్న జూన్ 20 తెల్లవారు ఝామున మెగా కోడలు ఉపాసన కొణిదెల పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన విషయాన్ని అపోలో డాక్టర్స్ ప్రకటించడమే కాదు.. మెగా ప్రిన్సెస్ పుట్టినట్లుగా మెగాస్టార్ మురిసిపోతూ మీడియాకి తెలియజేసారు. మహార్జాతకురాలు, తనకి మహాలక్ష్మి లాంటి మనవరాలు పుట్టిందంటూ మెగాస్టార్ చిరు ఆనందం వ్యక్తం చేసారు. నిన్న అపోలో ఆసుపత్రికి రామ్ చరణ్ కూతుర్ని చూసేందుకు మెగా ఫ్యామిలీ మెంబెర్స్ క్యూ కట్టారు. మెగా అభిమానులైతే అపోలో ఆసుపత్రి చుట్టూనే కాపు కాచారు.
అయితే సాయంత్రానికి సోషల్ మీడియాలో మెగా ప్రిన్సెస్ పిక్ అంటూ ఓ బేబీ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈపాపే రామ్ చరణ్-ఉపాసన ల బిడ్డ అని చెప్పడంతో మెగా ఫాన్స్ రెచ్చిపోయి దానిని ట్రెండ్ చేసారు. అయితే మెగా ఫ్యామిలీ నుండి రామ్ చరణ్ కుమార్తె మెగా ప్రిన్సెస్ పిక్ బయటికి రాలేదు అని తెలుస్తోంది. ఆ పిక్ అయితే చరణ్ కూతురిది కాదని, అది ఫేక్ ఫోటో మాత్రమే అందులో ఎలాంటి నిజం లేదు, మెగా ఫ్యామిలీ మెగా ప్రిన్సెస్ పిక్ ని అసలు షేర్ చెయ్యలేదని అంటున్నారు.
అయితే చాలా మంది ఆ బేబీ ఫోటో నే మెగా ప్రిన్సెస్ అనుకోని నమ్మారు. ప్రసుతమైతే మెగా ఫ్యామిలీ సంతోషంలో మునిగిపోయింది. సంబరాల్లో మునిగి తెలుస్తుంది. త్వరలోనే మెగా అభిమానులని సర్ ప్రైజ్ చేసేందుకు మెగా ప్రిన్సెస్ పిక్ ని షేర్ చేస్తారని సమాచారం.