కొన్నేళ్ళపాటు టాలీవుడ్ ని ఏలిన రకుల్ ప్రీత్ కి ఇప్పుడు తెలుగులో అవకాశాలు కరువైపోయాయి. కొంతమంది మాత్రం రకుల్ ప్రీత్ కావాలనే సౌత్ కి దూరంగా ఉంటుంది అంటూ ఉంటారు. కానీ రకుల్ సౌత్ లో సినిమాలు చేసి చాలా కాలమైపోయింది. ప్రస్తుతం కమల్ హాసన్ తో ఇండియన్ 2 లో సెకండ్ హీరోయిన్ గా నటిస్తుంది. అయితే హిందీలో బిజీగా వున్న రకుల్ ప్రీత్ అక్కడి హీరో మరియు నిర్మాత అయిన జాకీ భగ్నానీతో ప్రేమలో పడి.. అతనితో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతుంది. ఈమధ్యనే ఓ పెళ్లి వేడుకలో ఇద్దరూ ముచ్చటగా కనిపించారు.
అయితే పెళ్లి విషయంలో కంగారు పడని రకుల్ ప్రీత్ తాజాగా ప్రేమపై, స్నేహంపై సన్సేషనల్ కామెంట్స్ చేసింది. ప్రేమలోని సమస్యలు, ప్రేమలో జరిగే మోసాలపై మాట్లాడింది. ప్రేమకి పెద్ద శత్రువు అబద్దం. ఇద్దరి మధ్యన సన్నిహిత సంబంధం గురించి దాచేందుకు అబద్దం చెప్పడం పెద్ద విషయం కాదు. ప్రేమించిన వ్యక్తి నుండి ప్రేమని పొందడానికి ముందు ఇద్దరి మధ్యన ఉన్న స్నేహాన్ని ఇష్టపడతాను. కారణం ఆ స్నేహంలో ఏదైనా మనసు విప్పి మాట్లాడుకోవచ్చు. స్నేహంలో దాచడానికి, అబద్దాలు మ్లాడుకోవడానికి తావివ్వరు.
తప్పు చేసినా అది మారడానికి సమయం తీసుకోవచ్చు, దాన్ని స్నేహంలోనే మనసు విప్పి చెప్పుకోవచ్చు. చేసిన తప్పు చెప్పకపోవడమే ప్రేమకి పెద్ద సమస్య. ప్రేమలో ఉండి.. అబద్దం చెప్పి, మోసం చేసేవాళ్ళంటే నాకు నచ్చదు. అసలు ఈ కాలంలో ప్రేమని తప్పుగా వాడుకుంటున్నారు. ప్రేమించే వ్యక్తికి స్వేచ్ఛ ఇవ్వకుండా తాము చెప్పిందే జరగాలని ఒత్తిడి చేస్తున్నారు. ఒకరిని ఒకరు మోసం చేసుకోకుండా మనసు విప్పి మట్లాడుకుని సమస్యలు పరిష్కారం చేసుకుంటే ప్రేమ ఎప్పటికీ నిలుస్తుంది అంటూ రకుల్ ప్రీత్ ప్రేమలో జరిగే మోసాలపై ఈ విధంగా స్పందించింది.