Advertisementt

మెగాస్టార్ ఫ్యామిలీకి అది శాపమా? వరమా?

Wed 21st Jun 2023 11:47 AM
ram charan,upasana  మెగాస్టార్ ఫ్యామిలీకి అది శాపమా? వరమా?
Another girl in the Chiranjeevi family మెగాస్టార్ ఫ్యామిలీకి అది శాపమా? వరమా?
Advertisement
Ads by CJ

మెగాస్టార్ చిరంజీవి వాళ్ళ అమ్మగారు అంజనాదేవిగారికి ఐదుగురు సంతానంలో ముగ్గురు అబ్బాయిలు, ఇద్దరు అమ్మాయిలు. చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్, ఇద్దరు చెల్లెళ్ళు. అయితే మెగాస్టార్ చిరుకి ఇద్దరు ఆడపిల్లలు, ఒక అబ్బాయి. అలాగే నాగబాబుకు ఒక అబ్బాయి, ఒక అమ్మాయి. ఇక పవన్ కళ్యాణ్ కి మొదటి భార్యతో పిల్లలు లేకపోయినా.. రేణు దేశాయ్ తో ఒక అబ్బాయి, ఒక అమ్మాయి ఉన్నారు. ఆతర్వాత మూడో భార్యకి ఓ అబ్బాయి ఉన్నాడు. అయితే మూడో తరంలో అంటే చిరు కూతుళ్ళలో సుశ్మితకి ఇద్దరు అమ్మాయిలు, శ్రీజ కి మొదటి భర్త భరద్వాజ్ తో ఒక అమ్మాయి, రెండో భర్త కళ్యాణ్ దేవ్ తో కూడా ఒక అమ్మాయి ఉన్నారు. అందరూ ఆడపిల్లలే.

ఇక రామ్ చరణ్-ఉపాసనలకు అయినా మెగా వారసుడు జన్మిస్తాడని మెగా అభిమానులు ఆరాటపడ్డారు. పదేళ్ల తర్వాత మెగా ఫ్యామిలోకి వారసుడు వస్తాడని వాళ్ళు కలలు కన్నారు. కానీ రామ్ చరణ్-ఉపాసనలకి కూడా పాపే పుటింది. మెగా ఫ్యామిలీలోకి మెగా ప్రిన్స్ వచ్చింది అని ఓ పక్క ఆనందం, మరో పక్క మెగా ఫాన్స్ లో కాస్త డిస్పాయింట్మెంట్ కనిపిస్తుంది. రామ్ చరణ్ కి వారసుడు దిగితే మెగా ఫ్యామిలీలో మూడో తరం వారసుడు పుట్టారని పండగ చేసుకునేవారు. కానీ మెగాస్టార్ ఫ్యామిలోకి మూడోతరం వారసుల్లో అందరూ ఆడపిల్లలే జన్మించారు.

దానితో మెగాస్టార్ చిరు తమ ఇంటికి లక్ష్మీదేవి వచ్చింది అంటూ మురిసిపోయినా.. ఇలా వరసగా ఆడపిల్లలు జన్మించడం మెగాస్టార్ ఫ్యామిలీకి శాపమా.. లేదంటే ఆయన చెప్పినట్టుగా నిజంగానే వరమా అంటూ చాలామంది డౌట్స్ ఎక్స్ ప్రెస్ చేస్తున్నారు. మరి నిజంగా రామ్ చరణ్ కి అబ్బాయి పుడితే ఈ సంబరాలు మరింతగా కనిపించేవి, మెగా ఫాన్స్ కూడా ఎక్కడా ఆగేవాళ్ళు కాదు.

Another girl in the Chiranjeevi family:

Ram Charan and Upasana blessed with a baby girl

Tags:   RAM CHARAN, UPASANA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ