Advertisementt

హనుమాన్ పై ఆదిపురుష్ రైటర్ కామెంట్స్

Wed 21st Jun 2023 08:51 AM
adipurush  హనుమాన్ పై ఆదిపురుష్ రైటర్ కామెంట్స్
Adipurush Writer Sensational Comments హనుమాన్ పై ఆదిపురుష్ రైటర్ కామెంట్స్
Advertisement
Ads by CJ

ఆదిపురుష్ పై ఉన్న వివాదాలు చాలవన్నట్టు ఇప్పుడు ఆదిపురుష్ రైటర్ మరోసారి కాంట్రవర్సీ కామెంట్స్ చేసాడు. ప్రభాస్-ఓమ్ రౌత్ కలయికలో తెరకెక్కిన ఆదిపురుష్ విడుదలకు ముందు ఎంత హైప్ అయితే ఉందో.. విడుదలయ్యాక అంతే నెగిటివిటి, అన్నే కాంట్రవర్సీలని మూటగట్టుకుంది. రామాయణాన్ని అవమానించారంటూ బయట నానా రచ్చ జరుగుతుంది.. ఇప్పుడు ఆదిపురుష్ ని బ్యాన్ చెయ్యాలంటూ సినిమా వాళ్ళే గోల చేస్తున్నారు. మరోపక్క ఖాట్మండులో ఆదిపురుష్ పై ఇప్పటికే నిషేధం విధించారు.

అయితే తాజాగా ఆదిపురుష్ రైటర్ మనోజ్ శుక్లా బాలీవుడ్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో సెన్సేషనల్ కామెంట్స్ చెయ్యడం ఆదిపురుష్ పై మరో కాంట్రవర్సీని క్రియేట్ చేసింది. హనుమంతుడు దేవుడు కాదు ఆయనొక భక్తుడు, హనుమంతుడును బలవంతుడు అంటూ పూజిస్తూ మనమే ఆయన్ని దేవుణ్ణి చేసాము.. అంటూ మనోజ్ శుక్లా చేసిన వ్యాఖ్యలపై హనుమాన్ భక్తులు మండిపడుతున్నారు. 

ఇప్పటికే ఆదిపురుష్ కి ఉన్న వివాదాలు చాలవన్నట్టుగా.. ఇప్పడు మనోజ్ శుక్లా హనుమంతుడు దేవుడు కాదు.. భక్తుడు అంటూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి.  

Adipurush Writer Sensational Comments:

Adipurush dialogue writer Manoj Muntashir says Bajrangbali bhagwan nahi hai

Tags:   ADIPURUSH
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ