Advertisementt

ఇకపై ఒంటరిగానే అంటున్న రష్మిక

Wed 21st Jun 2023 08:06 AM
rashmika mandanna  ఇకపై ఒంటరిగానే అంటున్న రష్మిక
Rashmika manager issue manages her own ఇకపై ఒంటరిగానే అంటున్న రష్మిక
Advertisement
Ads by CJ

రష్మిక మందన్న నేషనల్ క్రష్ గా పలు భాషల్లో సినిమాలు చేస్తూ బిజీగా మారిపోయింది. కన్నడ నుండి తెలుగుకి పరిచయమై ఇక్కడ తెలుగులో స్టార్ డమ్ ని సొంతం చేసుకున్న రష్మిక.. ఆ తర్వాత హిందీలోకి అడుగుపెట్టింది. అక్కడ సక్సెస్ లతో పని లేకుండా సినిమాలు చేసుకుంటూపోతుంది. తమిళనాట స్టార్ హీరోలతో సినిమాలు చేసినా రశ్మికకి అక్కడ అంతగా కలిసి రాలేదు. రీసెంట్ గానే హిందీలో రణబీర్ కపూర్ - సందీప్ వంగా తో చేస్తున్న యానిమల్ షూటింగ్ కంప్లీట్ కావడంతో సెట్ లో సెల్ఫీలతో సందడి చేసింది.

రణబీర్ కపూర్ తో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నందుకు తెగ ఎగ్జైట్ అవుతుంది. అయితే రీసెంట్ గా రష్మిక తన మేనేజర్ చేతిలో మోసపోయింది అనే న్యూస్ బాగా వైరల్ అయ్యింది. తన దగ్గర ఎన్నో ఏళ్ళుగా నమ్మకంగా పని చేస్తున్న మేనేజర్ ఆమెకి తెలియకుండానే 80 లక్షలు కాజెయ్యడం రశ్మికకి షాకిచ్చినట్లుగా చెప్పుకున్నారు. రష్మిక తన మేనేజర్ మోసాన్ని సహించలేకపోయిందట. అందుకే ఇకపై ఎవరిని నమ్మకూడదని డిసైడ్ అయినట్లుగా తెలుస్తుంది.

ఇంతకుముందు తన డేట్స్ చూసుకునేందుకు మేనేజర్ ని మెయింటింగ్ చేసిన రష్మిక.. ఇప్పుడు ఆతను మోసం చెయ్యడంతో.. ఇక ఎలాంటి మేనేజర్లుని పెట్టుకోకుండా ఒంటరిగానే మేనేజ్ చెయ్యాలనుకంటుందట. తన డేట్స్ తానే చూసుకోవాలని, మళ్ళీ మళ్ళీ ఇలాంటి తప్పులకి తావివ్వకూడదనే రశ్మిక ఈ నిర్ణయానికి వచ్చిందట. అయితే మేనేజర్ లేకుండా రష్మిక డేట్స్ చూసుకోవడం అనేది మాములు విషయం కాదు. అది సాధ్యమయ్యేపని కూడా కాదు. మరి ఎలా హ్యాండిల్ చేస్తుందో చూద్దాం.

Rashmika manager issue manages her own:

Rashmika Mandanna manager cheats her of ₹80 lak

Tags:   RASHMIKA MANDANNA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ