Advertisementt

శ్రీలీల లక్కే లక్కు

Tue 20th Jun 2023 08:14 PM
pooja hegde,guntur karam  శ్రీలీల లక్కే లక్కు
Sreeleela main lead in Guntur Karam శ్రీలీల లక్కే లక్కు
Advertisement
Ads by CJ

అయ్యో ఇంత క్రేజీ హీరోయిన్ అయ్యుండి మహేష్ బాబు సినిమాలో సెకండ్ హీరోయిన్ గా చేస్తుందా అని శ్రీలీల అభిమానులు చాలా బాధపడిపోయారు. వరసగా ఎనిమిది ప్రాజెక్ట్స్ కి సైన్ చేసి మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిన శ్రీలీల బాలయ్య సినిమాలో అంటే కీలక పాత్రలో కనిపిస్తుంది. ఆందులో కాజల్ రోల్ కి శ్రీలీల రోల్ కి కాంపిటీషన్ ఉండదు. కానీ మహేష్ గుంటూరు కారంలో పూజ హెగ్డే మెయిన్ హీరోయిన్ గా ఎంపిక చేసిన త్రివిక్రమ్ శ్రీలీలని సెకండ్ హీరోయిన్ గా ఎంపిక చేసాక.. సోషల్ మీడియాలో ఈ సెకండ్ హీరోయిన్ అనే పదం బాగా వినిపించగా.. శ్రీలీల సెకండ్ కాదు మెయిన్ హీరోయిన్ అని నిర్మాత నాగ వంశీ చెప్పినప్పుడే అర్ధం చేసుకోవాల్సింది.

కానీ ఇప్పుడు అందరికి శ్రీలీల మెయిన్ హీరోయిన్ అని ఓ క్లారిటీ వచ్చేసింది. కారణం మహేష్ గుంటూరు కారం నుండి పూజ హెగ్డే తప్పుకున్నదనే న్యూస్ తో పాటుగా.. శ్రీలీల గుంటూరు కారం లో సింగిల్ హీరోయిన్ అని, మెయిన్ హీరోయిన్ అంటూ సోషల్ మీడియాలో కొన్ని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. సోషల్ మీడియాలో గుంటూరు కారం నుండి పూజా హెగ్డే అవుట్ అన్న న్యూస్ బాగా వైరల్ అయ్యింది. మరి పూజ హెగ్డే తప్పుకుంటే శ్రీలీలనే మెయిన్ హీరోయిన్ అవుతుంది.

ఇప్పటికే శ్రీలీల బర్త్ డే రోజున గుంటూరు కారంలో ఆమె ఫస్ట్ లుక్ తోనే అందరిని ఫిదా చేసారు. లంగాఓణిలో చాలా క్యూట్ గా తన కాలి వేళ్ళకి నెయిల్ పోలిష్ వేసుకుంటూ గుంటూరు మిర్చి ఘాటులాంటి లుక్ తో అందరిని ఇంప్రెస్స్ చేసింది. ఇకపై గుంటూరు కారంలో శ్రీలీల మెయిన్ హీరోయిన్ కాగా.. రెండు సినిమాలకే మహేష్ తో ఫుల్ గా స్క్రీన్ స్పేస్ దక్కడం నిజంగా శ్రీలీల అదృష్టమే మరి.

Sreeleela main lead in Guntur Karam:

Pooja Hegde Out Of Guntur Karam?

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ